అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో భారీ డిస్కౌంట్లు ఇక కుదరవు!

న్యూఢిల్లీ: ఈ-కామర్స్ సైట్లపై భారత ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకురానుంది. ఇవి అమల్లోకి వస్తే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లాంటి ఈ-కామర్స్ సైట్లు ఇక నుంచి ఫ్లాష్ సేల్స్ అంటూ వస్తువులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించే అవకాశం ఉండదు. ఇప్పటికే వినియోగదారుల రక్షణ చట్టానికి చేసిన సవరణలపై జులై 6లోగా వ్యాఖ్యలు/సలహాలు ఇవ్వాలని వినియోగదారుల వ్యవహారాల శాఖ కోరింది. ఇండియాలో ఏడాది మొత్తం ఏదో ఒక సందర్భం పేరు చెప్పి భారీ డిస్కౌంట్లతో సేల్స్ ప్రకటిస్తాయి ఈ సైట్లు. దీనివల్ల చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఈ-కామర్స్ సైట్ల వల్ల నష్టపోతున్నామంటూ వినియోగదారులు, వ్యాపారులు, అసోసియేషన్ల నుంచి ఎన్నో ఫిర్యాదులు వచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. దీంతో ఇండియాలో ఏ ఈ-కామర్స్ సైటు కూడా ఫ్లాష్ సేల్స్ నిర్వహించకూడదన్న ప్రతిపాదనను వినియోగదారుల మంత్రిత్వ శాఖ తెరపైకి తెచ్చింది. ఈ ఫ్లాష్ సేల్స్ ఇటు కస్టమర్లకు, అటు ఈ-కామర్స్ సైట్లకు బాగానే లాభాలు తెచ్చిపెడుతున్నా.. చిన్న వ్యాపారులు మాత్రం నష్టపోతున్నారు.
ఇలాంటి ఫ్లాష్ సేల్స్‌తో వినియోగదారులకు ఉండే అవకాశాలను ఈ-కామర్స్ సైట్లు పరిమితం చేస్తున్నాయని, దీనివల్ల భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశం ఉంటుందని ఆ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. అంతేకాకుండా సెర్చ్ ఫలితాలను తారుమారు చేసి కొందరే సెల్లర్లను ఈ-కామర్స్ సైట్లు ప్రమోట్ చేస్తున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

