Nissan Magnite RED | ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ మోటార్స్ ఇండియా తన మాగ్నైట్ రెడ్ ( Magnite RED ) ఎడిషన్ కారు ఆవిష్కరించింది. దీని ధర రూ.7.86-9.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కారు మూడు వేరియంట్లలో 1.0 లీటర్ల ఎంటీ, 1.0 లీటర్ల టర్బో ఎంటీ, 1.0 లీటర్ల టర్బో సీవీటీ వేరియంట్లలో వస్తున్నది. పాపులర్ నిస్సాన్ మోడల్ కారు మాగ్నైట్ ఎక్స్‌వీ వేరియంట్ ఆధారంగా రూపుదిద్దుకున్న మాగ్నైట్ రెడ్.. మాగ్నైట్ ఎక్స్‌వీ ఎంటీ రెడ్ ఎడిషన్, మాగ్నైట్ టర్బో ఎక్స్‌వీ ఎంటీ రెడ్ ఎడిషన్, మాగ్నైట్ టర్బో ఎక్స్‌వీ సీవీటీ రెడ్ ఎడిషన్లలో వస్తున్నది.
జపాన్‌లో డిజైన్ చేసిన మాగ్నైట్ రెడ్ వేరియంట్ కారు హెచ్ఆర్ఏ0 1.0 లీటర్ టర్బో ఇంజిన్ సామర్థ్యంతో తయారైంది. 160 ఎన్ఎం టార్చితోపాటు 100 పీఎస్ పవర్ వెలువరిస్తుంది. పెట్రోల్‌పై 20 కి.మీ. మైలేజీ వస్తుంది. రెండో మోనోటోన్ కలర్ ఆప్షన్లు..ఓన్ఎక్స్ బ్లాక్, స్టోర్మ్ వైట్ రంగుల్లో లభిస్తుంది.
ఈ కారులో వైర్లెస్ చార్జర్, పీఎం 2.5 ఎయిర్ ఫిల్టర్, ఎల్ఈడీ స్కఫ్ప్లేట్, యాంబియెంట్ మూడ్ లైటింగ్, 8.0 టచ్‌స్క్రీన్ విత్ వై-ఫై కనెక్టివిటీ, 7.0ఫుల్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రేర్ వ్యూ కెమెరా విత్ ప్రొజెక్షన్ గైడ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
ఇంకా ఆర్16 డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ ఫాగ్ లాంప్, ఎల్ఈడీ డేటైం రన్నింగ్ ల్యాంప్స్ (డీఆర్ఎల్స్) ఫీచర్లు కూడా కొనసాగుతాయి. బటన్ స్టార్ట్/ స్టాప్, వెహికల్ డైనమిక్స్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, హిల్ స్టార్ట్ అసిస్ట్ ఫీచర్లు కూడా జత చేశారు.