Market Pulse | ఆటుపోట్లకు ఆస్కారం.. త్రైమాసిక ఆర్థిక ఫలితాల ఆధారంగా పెట్టుబడులు
దేశీయ స్టాక్ మార్కెట్లలో గత వారం సైతం నూతన రికార్డులు నమోదయ్యాయి. అయితే వరుస లాభాలతో సూచీలు గరిష్ఠ స్థాయిల్లో కదలాడుతున్న వేళ.. మదుపరులు లాభాల స్వీకరణ దిశగా అడుగులు వేశారు.
Market Pulse | దేశీయ స్టాక్ మార్కెట్లలో గత వారం సైతం నూతన రికార్డులు నమోదయ్యాయి. అయితే వరుస లాభాలతో సూచీలు గరిష్ఠ స్థాయిల్లో కదలాడుతున్న వేళ.. మదుపరులు లాభాల స్వీకరణ దిశగా అడుగులు వేశారు. దీంతో ఓవరాల్‌గా స్వల్ప లాభాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 85.31 పాయింట్లు పెరిగి 80,604.65 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 28.75 పాయింట్లు అందుకుని 24,530.90 దగ్గర ముగిసింది. శుక్రవారం భారీ నష్టాలు వాటిల్లకపోతే సూచీలు నయా ఆల్‌టైమ్ హైల్లోనే ఉండేవి. ఇక ఈ వారం కూడా మదుపరులు ఆయా సంస్థల త్రైమాసిక ఆర్థిక ఫలితాల ఆధారంగా తమ పెట్టుబడులపై నిర్ణయం తీసుకునే వీలున్నది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) కోసం కంపెనీలు తమ ఫైనాన్షియల్ రిజల్ట్స్‌ను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ సూచీలు రికార్డుస్థాయి గరిష్ఠాల్లో ఉన్నందున పెట్టుబడులు-ఉపసంహరణల మధ్య ఇన్వెస్టర్లు కొట్టుమిట్టాడేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాగా, గ్లోబల్ స్టాక్ మార్కెట్లు, విదేశీ సంస్థాగత మదుపరుల పెట్టుబడులు, అంతర్జాతీయ పరిణామాలు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఎప్పట్లాగే ఈ వారం కూడా భారతీయ స్టాక్ మార్కెట్ల తీరును నిర్దేశించనున్నాయి. అమ్మకాల ఒత్తిడి ఎదురైతే నిఫ్టీకి 24,200 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 23,900 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం 24,700-24,900 మధ్యకు నిఫ్టీ వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

