కొత్త లుక్‌లో మారుతీ స్విఫ్ట్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

ముంబై: మారుతీ సుజుకి 2021 స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ ఇండియాలో లాంచ్ అయింది. లుక్‌తోపాటు సేఫ్టీ, ఫీచర్ల విషయంలోనూ పలు అప్గ్రేడ్లతో ఈ మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు. ముఖ్యంగా లుక్ పరంగా కారు ఇక రెండు రంగుల్లో రానుంది. బాడీ కలర్‌కు పూర్తి కాంట్రాస్ట్‌గా రూఫ్ కలర్ ఉండనుంది. దీని ప్రారంభ ధరను రూ.5.73 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించారు. ఇండియాలోని ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లలో స్విఫ్ట్ ఎప్పుడూ టాప్‌లోనే ఉంటోంది. 2005లో లాంచ్ అయిన ఈ మోడల్.. ఇండియాలో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని లాంచింగ్ సందర్భంగా మారుతీ సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ అన్నారు.
ఇప్పటి కస్టమర్ అభిరుచులకు అనుగుణంగా స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్‌ను తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. ఇక ఇందులో వాడిన ఐడిల్ స్టార్ట్ స్టాప్ (ఐఎస్ఎస్) టెక్నాలజీతో ఇంజిన్ సామర్థ్యం కూడా పెరగనుంది. ఈ కొత్త స్విఫ్ట్ మూడు డ్యుయల్-టోన్ రంగుల్లో అందుబాటులోకి రానుంది. పర్ట్ ఆర్క్టిక్ వైట్ (పర్ల్ మిడ్నైట్ బ్లాక్ రూఫ్), సాలిడ్ ఫైర్ రెడ్ (పర్ల్ మిడ్నైట్ బ్లాక్ రూఫ్), పర్ల్ మెటాలిక్ మిడ్నైట్ బ్లూ (పర్ల ఆర్క్టిక్ వైట్ రూఫ్) కలర్స్‌లో స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ అందుబాటులో ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

