Reliance | రిలయన్స్‌కు చమురు సెగ.. 5 శాతం తగ్గిన నికర లాభం
దేశంలో అత్యంత విలువైన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లాభాలకు చమురు సెగ గట్టిగానేతాకింది. రిఫైనింగ్ మార్జిన్లు తక్కువగా ఉండటంతోపాటు పెట్రోకెమికల్ మార్జిన్లు తగ్గడంతో ఆర్థిక ఫలితాలపై ప్రభావం చూపింది.
Reliance | న్యూఢిల్లీ, జూలై 19: దేశంలో అత్యంత విలువైన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లాభాలకు చమురు సెగ గట్టిగానేతాకింది. రిఫైనింగ్ మార్జిన్లు తక్కువగా ఉండటంతోపాటు పెట్రోకెమికల్ మార్జిన్లు తగ్గడంతో ఆర్థిక ఫలితాలపై ప్రభావం చూపింది. టెలికం, రిటైల్ రంగాలు రాణించినప్పటికీ మిగతా రంగాలు నిరాశాజనక పనితీరు కనబరిచాయి. దీంతో గడిచిన త్రైమాసికానికిగాను కంపెనీ రూ. 15,138 కోట్లు(ప్రతి షేరుకు రూ. 22.37) కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది వచ్చిన రూ. 16,011 కోట్లు(ప్రతిషేరుకు రూ.23.66) పోలిస్తే 5 శాతం తగ్గింది. జనవరి-మార్చి త్రైమాసికంలో నమోదైన రూ.18,951 కోట్ల లాభంతో పోలిస్తే 20 శాతం తగ్గింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.2.31 లక్షల కోట్ల నుంచి రూ.2.57 లక్షల కోట్లకు ఎగబాకింది.
రిటైల్ ఆకర్షణీయం
రిలయన్స్ రిటైల్ వెంచర్ లిమిటెడ్ ఆకర్షణీయమైన లాభాలను ప్రకటించింది. జూన్ త్రైమాసికానికిగాను రూ.75,615 కోట్ల స్థూల ఆదాయంపై రూ.2,549 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.69,948 కోట్ల ఆదాయంతో పోలిస్తే 8.1 శాతం వృద్ధి నమోదుకాగా, రూ. 2,436 కోట్ల నికర లాభంతో పోలిస్తే 4.63 శాతం ఎగబాకింది. గత త్రైమాసికంలో కొత్తగా 331 రిటైల్ అవుట్లెట్లను ప్రారంభించతో మొత్తం సంఖ్య 18,918కి చేరుకున్నాయి.
- జియో కస్టమర్లు 48.18 కోట్ల నుంచి 48.97 కోట్లకు పెరిగాయి. సరాసరిగా ఒక్కో కస్టమర్‌పై వచ్చే ఆదాయం రూ. 180.5 నుంచి రూ.181.7 పెరిగింది.
- తలసరి డాటా వినిమయం నెలకు 30.3 జీబీ లేదా రోజుకు జీబీ డాటా కంటే అధికంగా నమోదైంది.
- కంపెనీ రుణాలు రూ.1.16 లక్షల కోట్ల నుంచి రూ.1.12 లక్షల కోట్లకు తగ్గాయి.
- కేజీ బేసిన్లో రోజుకు 28.7 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తున్నది.
జియో లాభం 5,445 కోట్లు
దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో లాభాలతో కళకళలాడుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.5,445 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో వచ్చిన లాభంతో పోలిస్తే 12 శాతం ఎగబాకింది. వరుస త్రైమాసికాలతో పోలిస్తే 2 శాతం వృద్ధి కనబరిచింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 10 శాతం ఎగబాకి రూ.26,478 కోట్లకు చేరుకున్నట్లు ప్రకటించింది.
చమురు, గ్యాస్ వ్యాపారాలు బలహీనంగా ఉన్నప్పటికీ కన్జ్యూమర్ విభాగాలు రాణించాయి. డిజిటల్ సర్వీసెస్, రిటైల్ రంగాలకు కస్టమర్ల నుంచి ఆశించిన స్థాయిలో కంటే అధికంగా మద్దతు ఉండటంతో ఈ విభాగాలను మరింత వేగవంతంగా విస్తరించనున్నాం.
– ముకేశ్ అంబానీ, రిలయన్స్ సీఎండీ
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

