ఎన్సీసీ వ్యవస్థాపకుడు ఏవీఎస్ రాజు కన్నుమూత
భారతీయ నిర్మాణ రంగంలో సత్తా చాటిన తెలుగు తేజం.. దేశవ్యాప్తంగా అద్భుత ప్రాజెక్ట్‌ల ఆవిష్కరణ
హైదరాబాద్, అక్టోబర్ 13: నిర్మాణ రంగ దిగ్గజ సంస్థ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్సీసీ) లిమిటెడ్ వ్యవస్థాపకుడు, గౌరవ చైర్మన్ అల్లూరి వెంకట సత్యనారాయణ (ఏవీఎస్) రాజు కన్నుమూశారు. మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్టు ఓ ప్రకటనలో ఎన్సీసీ లిమిటెడ్ తెలియజేసింది. ఆయన వయసు 89 ఏండ్లు. 1937లో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా అంతర్వేదిపాలెంలో జన్మించారు. ఆయన మృతిపట్ల తెలంగాణ, ఏపీ ప్రముఖులు.. దేశవ్యాప్తంగా వ్యాపార, పారిశ్రామిక వర్గాలు సంతాపం వ్యక్తం చేశాయి.
నిర్మాణ రంగంలో ఆయన చేసిన కృషికిగాను 2006లో భారతీయ బిల్డర్స్ అసోసియేషన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో గౌరవించింది. 2008లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఇక వ్యాపార, పారిశ్రామిక రంగాలకు ఆయన అందించిన సేవలకుగాను 2010లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. కాగా, బుధవారం జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెంబర్ 10లోగల ఆయన నివాసంలో భౌతికకాయాన్ని సందర్శనకు ఉంచనున్నారు.
ఎన్సీసీ ప్రయాణం..
- 1978లో నాగార్జున కన్స్ట్రక్షన్ కార్పొ రేషన్‌ను స్థాపించిన ఏవీఎస్ రాజు.
- 1990లో కంపెనీ లిమిటెడ్‌గా మార్పు.
- 1992లో పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ద్వారా బాంబే స్టాక్ ఎక్సేంజీ (బీఎస్ఈ)లో నమోదు.
- 1995లో సంస్థ టర్నోవర్ తొలిసారి రూ.100 కోట్లను దాటింది.
- 2001లో ఐఎస్ఓ 9001:2000 ధ్రువీకరణను పొందింది.
- 2005లో రూ.1,000 కోట్లు, 2011లో రూ.5,000 కోట్ల టర్నోవర్‌కు చేరింది.
- 2026 మార్చినాటికి రూ.20,944 కోట్ల టర్నోవర్‌కు చేరిక.
- రవాణా, సాగునీరు, ఇంధన, పట్టణాభివృద్ధి, క్రీడా, మౌలిక రంగాల్లో విస్తరణ.
- న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ 1ఏ, నేషనల్ వార్ మెమోరియల్‌ను నిర్మించినది ఎన్‌సీసీనే.
- బీహార్‌లోని నలందా విశ్వవిద్యాలయం, నాగ్‌పూర్, బెంగళూరు మెట్రో ప్రాజెక్టులను చేపట్టినది ఈ కంపెనీయే.
- విశాఖపట్నం 5వ నెంబర్ జాతీయ రహదారి, ఉప్పల్ క్రికెట్ స్టేడియం, ఏపీ గుండ్లకమ్మ జలాశయం ప్రాజెక్టులు చేపట్టినదీ ఈ సంస్థే.
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఆయా రాష్ర్టాల్లో హౌసింగ్ ప్రాజెక్టులు, ఎక్స్‌ప్రెస్ వేలు, రైల్వే ప్రాజెక్టులు, సిద్దిపేట సమీపంలో 400కేవీ ట్రాన్స్మిషన్ పవర్ లైన్, కర్ణాటకలోని గుల్బర్గా ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణం ఎన్సీసీదే.
రచయితగా..
రచయితగానూ ఏవీఎస్ రాజు సుపరిచితులు. తెలుగు భాషలో 12,000 పద్యాలు రాశారు. ‘శ్రీ సాయి సుధా మాధురి’ పేరిట సత్యసాయి బాబాపై ఓ గ్రంథాన్ని రచించారు. దీనికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటుదక్కడం విశేషం. అలాగే వరుసగా నాలుగేండ్లపాటు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ ఏవీఎస్ రాజుకు చోటు దక్కింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

