టెస్కాబ్‌కు జాతీయ ఉత్తమ అవార్డు
- జిల్లా సహకార బ్యాంకుల్లో కరీంనగర్‌కు పురస్కారం
- నాబార్డ్ 40వ వార్షికోత్సవాల్లో ప్రదానం

హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంకు (టెస్కాబ్) జాతీయ స్థాయిలో ఉత్తమ సహకార బ్యాంకుగా అవార్డును గెల్చుకున్నది. నాబార్డ్ 40వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం ఆన్లైన్ వేదికగా జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. దేశంలోని మొత్తం 33 అత్యున్నత సహకార బ్యాంకుల పనితీరును.. పాలన, సాంకేతికత, రుణాలు తదితర 16 అంశాల ఆధారంగా పరిశీలించి టెస్కాబ్ను ఉత్తమ బ్యాంకుగా నాబార్డ్ ప్రకటించింది. దక్షిణాది రాష్ర్టాల్లోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల విభాగంలో కరీంనగర్ జిల్లా బ్యాంకుకు ఉత్తమ పురస్కారం దక్కింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సహకార బ్యాంకుల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యం గా బ్యాంకుల సేవల్ని ఆన్లైన్ చేయడం, రైతులకు, ఖాతాదారులకు మెరుగైన సేవలు అందేలా చూసింది. అవార్డులపై టెస్కాబ్ అధ్యక్షుడు కొండూరు రవీందర్రావు, ఎండీ మురళీధర్ హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో రైతులకు, ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. బ్యాంకు పురోగతికి తోడ్పాటునందించిన ఉద్యోగులను అభినందించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | ఇషాన్, శ్రేయస్ అర్ధశతకాలు వృథా.. చివరి టీ20లో భారత్‌కు ఓటమి
2 AAP MLAs Quit | పంజాబ్‌లో ఆప్‌కు షాక్.. మొదటి జాబితా ప్రకటన తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా
Cyclone Murasu | దూసుకొస్తున్న మురాసు తుపాను.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన!
Fauzi | ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌పై కీలక అప్డేట్.. నవంబర్ 3 నుంచి మళ్లీ సెట్స్‌లోకి పాన్ ఇండియా స్టార్!
I’m Game OTT | ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

