Myntra New CEO | మింత్రా సీఈవోగా నందితా సిన్హా.. జనవరి నుంచి అమల్లోకి
Myntra New CEO | ఫ్లిప్‌కార్ట్ అనుబంధ మింత్రా సీఈవోగా నందితా సిన్హా నియమితులయ్యారు. జనవరి నుంచి ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు.

Myntra New CEO | ఫ్లిప్‌కార్ట్ అనుబంధ ఫ్యాషన్ ఈ-టైలర్ సంస్థ మింత్రా సీఈవోగా నందితా సిన్హా నియమితులయ్యారు. ఆమె నియామకం వచ్చే జనవరి నుంచి అమల్లోకి వస్తుంది. ఇంతకుముందు నందితా సిన్హా.. ఫ్లిప్‌కార్ట్ కన్జూమర్ గ్రోత్ అండ్ మార్కెటింగ్ విభాగం ఉపాధ్యక్షురాలిగా పని చేశారు. 2013లో ఆమె ఫ్లిప్‌కార్ట్‌లో చేరారు. నాటి నుంచి వివిధ క్యాటగిరీల్లో బహుముఖ పాత్రలు పోషించారు. బ్యూటీ అండ్ పర్సనల్ కేర్, బుక్స్ అండ్ జనరల్ మర్చండైజ్, హోం అండ్ ఫర్నీచర్ విభాగాల్లో పని చేశారు.
ఇంతకు ముందు మింత్రా సీఈవోగా పని చేసిన అమర్ నాగారం.. గత నెల 23న తన పదవికి రాజీనామా చేశారు. తన సొంత వెంచర్ పనులు చేపట్టేందుకు వైదొలుగుతున్నట్లు తెలిపారు. అయితే, తన తర్వాత సంస్థ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు డిసెంబర్ వరకు మింత్రా సీఈవోగా కొనసాగుతారు. తర్వాత సలహాదారుగా వ్యవహరిస్తానని తెలిపారు. ఈ విషయాన్ని మింత్రా వర్గాలు ధృవీకరించాయి. మూడేండ్ల క్రితం మింత్రా సీఈవోగా అమర్ నాగారం బాధ్యతలు చేపట్టారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Premature Baby : 5 నెలలకే పుట్టాడు.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు
shonke village | 5200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామానికే రెండే దారులు..
ఇక్కడ వందేండ్లు బతకడం చాలా కామన్.. కారణమేంటో తెలుసా !!
Married life tips | కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
Mukesh Ambani | స్పోర్ట్స్.. ఆతిథ్యంపై ముకేశ్ అంబానీ క్రేజీ.. అందుకే లండన్ ఎస్టేట్ సొంతం?!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సూర్యాపేట జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
Kona Venkat | అలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీకి క్రిమినల్స్.. హాట్ టాపిక్‌గా కోన వెంకట్ కామెంట్స్
Mukhara (K) | కేసీఆర్ సార్ పాలనలో బతుకంతా పచ్చగుండె: ముఖరా (కె) మహిళలు
Sunil Gavaskar | రెండో టీ20లో విలన్ అతడే.. ఆ ఇద్దరిలో ఒకరికి బంతి ఇవ్వాల్సింది..!
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

