Mutual Funds | పిల్లల విద్య కోసం ఏ ఫండ్ బెటర్?
రాజేశ్.. మ్యూచువల్ ఫండ్స్‌కు కొత్త. తన కుమారుడి ఉన్నత విద్య కోసం రాబోయే 12 ఏండ్లపాటు నెలకు రూ.5వేల చొప్పున పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఏ మ్యూచువల్ ఫండ్ స్కీంను ఎంచుకోవాలో తెలియక సతమతమవుతున్నాడు.
రాజేశ్.. మ్యూచువల్ ఫండ్స్‌కు కొత్త. తన కుమారుడి ఉన్నత విద్య కోసం రాబోయే 12 ఏండ్లపాటు నెలకు రూ.5వేల చొప్పున పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే ఏ మ్యూచువల్ ఫండ్ స్కీంను ఎంచుకోవాలో తెలియక సతమతమవుతున్నాడు. ఈ అయోమయం ఒక్క రాజేశ్‌కే కాదు.. విద్య, సొంతిల్లు, రిటైర్మెంట్ ఫండ్ తదితర లక్ష్యాల సాధన కోసం పెట్టుబడి మార్గాలను అన్వేషిస్తున్న ఇంకా ఎందరిదో. మరి మార్కెట్, ఆర్థిక నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం.
ఇది గుర్తుంచుకోండి
ముందుగా మీ పిల్లలను ఏం చదివించాలనుకుంటున్నారో.. దానికి ప్రస్తుతం అవుతున్న ఖర్చెంతో తెలుసుకోవాలి. ఆ మొత్తానికి 6 నుంచి 8 శాతం చొప్పున వార్షిక ద్రవ్యోల్బణం కలపాలి. పన్నులు ఇతరత్రా వ్యయాలనూ లెక్కించి ముందుకెళ్తే మరీ మంచిది. ఉదాహరణకు మీరు కోరుకుంటున్న కోర్సుకు ఇప్పుడు రూ.10 లక్షలు అవుతుందని అనుకుందాం. దీనికి 6 శాతం వార్షిక ద్రవ్యోల్బణాన్ని 12 ఏండ్లకు జోడిస్తే సుమారు రూ.20.12 లక్షలు అవుతుంది. కాబట్టి ఈ మొత్తం కోసం సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) కింద 12 ఏండ్లు ప్రతి నెలా పెట్టుబడిగా మీరు రూ.6,244 పెడితే సహజంగా అందే 12 శాతం ప్రతిఫలంతో ఆశించిన నగదును సమకూర్చుకోవచ్చు. మీరు పెట్టే పెట్టుబడి రూ.8,99,136. రాబడి రూ.11,13,006.58. మొత్తం రూ.20,12,142.58 పొందవచ్చు.
ఈ రకమైన రాబడులను అందించే మ్యూచువల్ ఫండ్స్ స్కీములు మార్కెట్లో ప్రస్తుతం చాలానే ఉన్నాయి. అనేక బ్యాంకులు, ఇతరత్రా సంస్థలూ వాటిని అందిస్తున్నాయి. ఒక్కసారి పరిశీలించి, మీకు అనువైన నిర్ణయం తీసుకోవచ్చు. అయితే మ్యూచువల్ ఫండ్స్‌ల్లో పెట్టుబడులు మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటాయి. కాబట్టి మీ రిస్క్ ప్రొఫైల్నుబట్టి ఓ నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. ఇందుకు మార్కెట్ ఎక్స్పర్ట్స్, మ్యూచువల్ ఫండ్ సలహాదారులను సంప్రదించడం చాలా మంచిది. తద్వారా మరింత మెరుగైన ఫలితాలను అందుకోవచ్చు. కాగా, కన్జర్వేటివ్ రిస్క్ ప్రొఫైలైతే లార్జ్ క్యాప్ ఫండ్స్‌ను, మాడరేట్ రిస్క్ ప్రొఫైలైతే మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవడం మేలని మార్కెట్ పండితులు సూచిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

