Ambani&Adani | అంబానీ.. అదానీ కంటే జుకర్‌బర్గ్ వెనక్కి.. ఎందుకంటే!
మెటా షేర్లు 26% పతనం కావడంతో ఫేస్బుక్ అధినేత జుకర్‌బర్గ్‌ను ముకేశ్ అంబానీ, గౌతం అదానీ దాటేశారు.
Ambani&Adani | ఇండియన్ బిలియనీర్ కార్పొరేట్లు ముకేశ్ అంబానీ, గౌతం అదానీ సరికొత్త మైలురాయిని దాటేశారు. కుబేరుల వ్యక్తిగత సంపదలో మెటా (ఫేస్బుక్) సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ను అధిగమించారు. మెటా ప్లాట్‌ఫామ్స్ స్టాక్ ఒక్కరోజులో భారీగా పతనం కావడంతో ఫేస్బుక్ అధినేత జుకర్‌బర్గ్ నికర సంపద 29 బిలియన్ల డాలర్లు కరిగిపోయింది. దీంతో ఫోర్బ్స్ రియల్‌టైం బిలియనీర్ల జాబితాలో జుకర్‌బర్గ్ 12వ స్థానానికి పడిపోయారు. ముకేశ్ అంబానీ, గౌతం అదానీ తర్వాత ర్యాంక్‌లోకి పతనం అయ్యారు.
మెటా షేర్లు 26 % డౌన్
అమెరికా సోషల్ మీడియా దిగ్గజం మెటా స్టాక్ శుక్రవారం 26 శాతం పతనం కావడంతో 200 బిలియన్ల డాలర్ల సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ హరించుకుపోయింది. కంపెనీ చరిత్రలో ఇంత భారీ మొత్తం ఎం-క్యాప్ నష్టపోవడం ఇదే తొలిసారి. దీంతో ఫేస్బుక్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ జుకర్‌బర్గ్ వ్యక్తిగత సంపద 85 బిలియన్ల డాలర్లకు దిగివచ్చింది. ఫేస్‌బుక్‌గా పేరొందిన మెటాలో జుకర్‌బర్గ్‌కు 12.8 శాతం వాటా ఉంది.
ఎలన్‌మస్క్ తర్వాత ఇదే గరిష్ఠం
గతేడాది నవంబర్‌లో టెస్లా సీఈవో ఎలన్‌మస్క్ వ్యక్తిగత సంపద 35 బిలియన్ల డాలర్లు పతనమైంది. టెస్లాలో తన వ్యక్తిగత వాటా 10 శాతం అమ్మాలా అని ట్వీట్ చేశాక నెటిజన్లు ట్రోల్ చేశారు. దీంతో ఆయన వ్యక్తిగత సంపద నష్టపోయారు. నాటి నుంచి ఎలన్‌మస్క్ ఇంకా కోలుకోలేదు. ఆ తర్వాత అత్యధికంగా ఒక్కరోజులో వ్యక్తిగత సంపద కోల్పోయిన కుబేరుడిగా జుకర్‌బర్గ్ నిలుస్తారు. గతేడాది జుకర్‌బర్గ్ 4.47 బిలియన్ల డాలర్ల విలువ గల వాటాలు విక్రయించారు.
జెఫ్‌బెజోస్ ఇలా గెయిన్
మరో బిలియనీర్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ వ్యక్తిగత సంపద 20 బిలియన్ల డాలర్లు పెరిగింది. అమెజాన్ బ్లాక్ బస్టర్ ఎర్నింగ్స్ సంపాదించడంతో ఇది సాధ్యమైంది. అమెజాన్‌లో జెఫ్ బెజోస్ వాటా 9.9 శాతం. ప్రపంచ కుబేరుల జాబితాలో జెఫ్ బెజోస్ మూడో ర్యాంక్‌లో ఉన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

