మోటోరోలా బెండింగ్ ఫోన్
ఒకప్పుడు ఫీచర్ ఫోన్.. ఆ తర్వాత స్మార్ట్ఫోన్.. ఇప్పుడు ఫోల్డబుల్ ఫోన్.. ఇక బెండింగ్ ఫోన్ వంతు వస్తున్నది. అమెరికన్ బహుళజాతి టెలీకమ్యూనికేషన్ దిగ్గజం మోటోరోలా.. ఈ బెండింగ్ ఫోన్ను ఆవిష్కరించింది. తమ మాతృ సంస్థ లెనోవా ‘టెక్ వరల్డ్ 2023’లో అత్యాధునిక ప్రోటోటైప్ బెండింగ్ స్మార్ట్ఫోన్ను మోటోరోలా పరిచయం చేసింది.
ఇల్లినాయిస్, అక్టోబర్ 25: ఒకప్పుడు ఫీచర్ ఫోన్.. ఆ తర్వాత స్మార్ట్ఫోన్.. ఇప్పుడు ఫోల్డబుల్ ఫోన్.. ఇక బెండింగ్ ఫోన్ వంతు వస్తున్నది. అమెరికన్ బహుళజాతి టెలీకమ్యూనికేషన్ దిగ్గజం మోటోరోలా.. ఈ బెండింగ్ ఫోన్ను ఆవిష్కరించింది. తమ మాతృ సంస్థ లెనోవా ‘టెక్ వరల్డ్ 2023’లో అత్యాధునిక ప్రోటోటైప్ బెండింగ్ స్మార్ట్ఫోన్ను మోటోరోలా పరిచయం చేసింది.
మడత ఫోన్లకు అప్డేట్ మోడల్గా వస్తున్న ఈ బెండింగ్ ఫోన్లను ఏకంగా చాప చుట్టినట్టు చుట్టేయవచ్చు. చేతికి వాచీ, బ్రేస్లెట్లాగా కూడా ధరించవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే కస్టమర్లు దీన్ని ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. నిజానికి 2016 టెక్ వరల్డ్ ఈవెంట్లోనే దీన్ని సంస్థ పరిచయం చేసింది. అయితే ఇప్పుడీ ఫోన్ను మార్కెట్లోకి తొందర్లోనే తెచ్చేందుకు మోటోరోలా సిద్ధమవుతున్నది. అయితే ధర, ఇతరత్రా వివరాలను ప్రకటించాల్సి ఉన్నది.
ఈ ఫోన్ విశేషాలెన్నో..
- ఫుల్ హెచ్డీ, పీవోఎల్ఈడీ డిస్ప్లే
- 6.9 అంగుళాల స్క్రీన్.. వీలునుబట్టి 4.6 అంగుళాలకు తగ్గించుకునే సౌకర్యం
- ఫ్యాబ్రిక్ మెటీరియల్తో ఫోన్ వెనుక వైపు డిజైనింగ్
- ప్రస్తుత మోడల్స్ కంటే మెరుగైన కెమెరాలుంటాయని అంచనా
- స్టోరేజీ, ర్యామ్, బ్యాటరీ సామర్థ్యాలపైనా పెరుగుతున్న ఆసక్తి
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

