Motorola | దేశంలోకెల్లా బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా (Motorola) తన ఫ్లాగ్ షిప్ ఫోన్లపై రూ.10 వేల డిస్కౌంట్ ప్రకటించింది. ఈ నెల 15 నుంచి ప్రారంభమైన ఈ డిస్కౌంట్ ఈ నెల 24 వరకూ కొనసాగనున్నది. స్మార్ట్ ఫోన్లలో అత్యంత అడ్వాన్స్డ్ ఫ్లిప్ ఫోన్లు- రేజర్ 40, రేజర్ ఆల్ట్రా ఫోన్లపై రూ.10 వేల భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. రేజర్ 40 ఆల్ట్రా ఫోన్ రూ.79,999, రేజర్ 40 ఫోన్ రూ.49,999లకు లభిస్తుంది. దేశీయ స్మార్ట్ ఫోన్ల మార్కెట్ ఫ్లిప్ సెగ్మెంట్లో ఇవే చౌక.
దీనికి అదనంగా ‘మోటో డేస్’ సందర్భంగా ఈ నెల 18 నుంచి 24 వరకూ స్పెషల్ డిస్కౌంట్ రూ.5000 అభిస్తుంది. అయితే మోటరోలా రేజర్ 40 ఆల్ట్రా ఫోన్‌పై రూ.5000 ధర తగ్గింపుతో రూ.77 వేలకు వస్తుంది.రేజర్ 40 ఫోన్ రూ.44,999లకు అందుబాటులో ఉంది. లీడింగ్ బ్యాంకుల్లో మూడు నెలలు, ఆరు నెలలు, తొమ్మిది నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది. మోటరోలా రేజర్40 ఆల్ట్రాపై నెలకు రూ.8,111 ఈఎంఐ, మోటరోలా రేజర్ 40 ఫోన్ పై రూ.5000 నెలవారీ ఈఎంఐ చెల్లించి కొనుగోలు చేయొచ్చు.
మోటరోలా రేజర్40 ఆల్ట్రా ఫోన్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్వోసీ చిప్ సెట్, మోటరోలా రేజర్40 ఫోన్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 ఎస్వోసీ చిప్ సెట్ తో వస్తున్నాయి. రెండు ఫోన్లు 6.9 అంగుళాల ఓలెడ్ ఎల్టీపీఓ ఇన్నర్ డిస్ప్లేతో అందుబాటులో ఉన్నాయి. మోటరోలా రేజర్ 40 ఆల్ట్రా ఫోన్ 30 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 3800 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, రేజర్ 40 ఫోన్ 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4200 ఎంఎహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. మోటరోలా రేజర్ 40 ఆల్ట్రా.. ఇన్ఫినైట్ బ్లాక్, వివా మెజెంటా కలర్ ఆప్షన్లు, మోటరోలా రేజర్ 40 ఫోన్ సాగే గ్రీన్, సమ్మర్ లిలాక్, వనీలా క్రీమ్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి.