Moto G84 5G | 50ఎంపీ కెమెరాతో మోటో జీ84 5జీ లాంఛ్
50ఎంపీ కెమెరా, లెదర్ బ్యాక్‌తో మోటో జీ84 5జీని (Moto G84 5G) దేశీ మార్కెట్లో కంపెనీ లాంఛ్ చేసింది. కాలేజ్ స్టూడెంట్స్ వంటి యువ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని రూ. 20,000లోపు ధరలో ఈ డివైజ్‌ను మోటో ప్రవేశపెట్టింది.
న్యూఢిల్లీ : 50ఎంపీ కెమెరా, లెదర్ బ్యాక్‌తో మోటో జీ84 5జీని (Moto G84 5G) దేశీ మార్కెట్లో కంపెనీ లాంఛ్ చేసింది. కాలేజ్ స్టూడెంట్స్ వంటి యువ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని రూ. 20,000లోపు ధరలో ఈ డివైజ్‌ను మోటో ప్రవేశపెట్టింది. డీసెంట్ కెమెరా సెటప్, ఫాస్ట్ చార్జింగ్, ట్రెండీ డిజైన్ వంటి ఫీచర్లతో అందుబాటు ధరలో మోటో లేటెస్ట్ ఫోన్ యువతను ఆకట్టుకోనుంది. ప్యాంటోన్ కలర్ ఎడిషన్‌తో కంపెనీ జీ సిరీస్ లైనప్‌లో మోటో జీ84 తొలి స్మార్ట్‌ఫోన్.
ఇక కీలక ఫీచర్ల విషయానికి వస్తే మోటో లేటెస్ట్ ఫోన్ 50 మెగాపిక్సెల్ ఓఐఎస్ ఆధారిత కెమెరా, 256జీబీ స్టోరేజ్, 30డబ్ల్యూ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు కస్టమర్లను ఆకట్టుకుంటాయి. మోటో జీ 84 5జీ సింగిల్ స్టోరేజ్ (256జీబీ + 12జీబీ ర్యాం) ఆప్షన్ రూ. 19,999కి అందుబాటులో ఉంటుంది. బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో కస్టమర్లకు ఈ డివైజ్ రూ. 18,999కి లభిస్తుంది.
జియోతో కలిసి మోటోరోలా రూ. 5000 వరకూ ఇతర బెనిఫిట్స్ ఆఫర్ చేస్తుంది. వివా మజెంటా, మార్ష్‌మాలో బ్లూ ఆప్షన్లు లెదర్ ఫినిష్‌తో రానుండగా, మిడ్నైట్ బ్లూ వేరియంట్ గ్లాస్ తరహా పీఎంఎంఏ మెటీరియల్‌తో ఆకట్టుకుంటుంది. ఇక మోటో జీ84 6.5 ఇంచ్ పోల్డ్ డిస్ప్లేతో కస్టమర్ల ముందుకు రానుంది. మోటో జీ84 స్నాప్‌డ్రాగన్ 695 ఎస్ఓసీ ప్రాసెసర్, 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో ఆకట్టుకోనుంది. మోటో జీ84 5జీ ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌పై రన్ అవుతుంది. మోటో స్పేటియల్ ఆడియోకు సపోర్ట్ చేసేలా డాల్బీ ఆట్మాస్ స్పీకర్లతో మోటో జీ84 రానుండగా 3డీ సౌండ్ ఎఫెక్ట్స్‌ను ఆఫర్ చేస్తుంది.
Read More :
Remote Working | టెకీలపై నిఘా : సాఫ్ట్‌వేర్‌తో రిమోట్ వర్కర్లను ట్రాక్ చేస్తున్న కంపెనీలు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

