హెటిరో నుంచి మోల్నుపిరవిర్
- ఉత్పత్తికి కెనడా సంస్థతో ఒప్పందం

హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): కరోనా చికిత్సలో వినియోగించే మోల్నుపిరవిర్‌ను ఉత్పత్తి చేయనున్నట్టు హైదరాబాద్ దిగ్గజ ఫార్మా సంస్థ హెటిరో ప్రకటించింది. ఈ ఔషధం ఉత్పత్తి, మార్కెటింగ్‌కు తాము కెనడాకు చెందిన మెర్క్‌షార్ప్ అండ్ డోమ్ (ఎంఎస్డీ) బయోఫార్మాతో ఒప్పందం చేసుకున్నామని హెటిరో ఒక ప్రకటనలో వెల్లడించింది. మోల్నుపిరవిర్ ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నది. ఈ ఔషధం వినియోగానికి అత్యవసర అనుమతులు రాగానే ఉత్పత్తిని ప్రారంభిస్తామని తెలిపింది. ఈ సందర్భంగా హెటిరో గ్రూప్ చైర్మన్ పార్థసారథిరెడ్డి మాట్లాడుతూ.. దేశం కరోనాతో పోరాడుతున్న సమయంలో మోల్నుపిరవిర్‌ను ఉత్పత్తి చేసి అందించడం సంతోషంగా ఉన్నదని, ఈ ఔషధం అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని వెంటనే డీసీజీఐని కోరుతామని తెలిపారు.
ఆప్టిమస్ కూడా…
స్వల్ప, మధ్యస్త లక్షణాలతో ఉన్న కొవిడ్-19ను అదుపుచేసే ఔషధంగా పేర్కొంటున్న మోల్నుపిరవిర్‌పై మూడో దశ క్లినికల్ పరిక్షకు సిద్ధంగా ఉన్నట్లు హైదరాబాద్‌కు చెందిన ఆప్టిమస్ ఫార్మా సంస్థ ప్రకటించింది. ఈ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కోసం సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనేజేషన్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మోల్నుపిరవిర్ ద్వారా చికిత్స అందించిన వారిలో కేవలం ఐదు రోజుల్లో సత్ఫలితాలు కనిపించనున్నాయని, నోటి ద్వారా అందించే చికిత్స కావడంతో రోగులకు ఇబ్బందులు తగ్గుతాయని కంపెనీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- hetero
- Molnupiravir
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

