లండన్ ప్లైట్ల రేట్లు పెరిగాయ్!.. ఎంతో తెలుసా?!
లండన్‌కు వెళ్లాలంటే.. ! | న్యూఢిల్లీ-లండన్ మధ్య విమాన సర్వీస్‌పై విస్తారా.. ఎకానమీ క్లాస్ టికెట్ ధర రూ.1,03,191 నుంచి రూ.1,21,356 వసూలు ...

న్యూఢిల్లీ: మీరు బ్రిటన్‌కు వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నారా.. అయితే టికెట్ల ధరలో మాత్రం రిలీఫ్ లేదు. టికెట్ల ధరలు భారీగా పెంచేశాయి వివిధ ఎయిర్ లైన్స్.
ఈ నేపథ్యంలో న్యూఢిల్లీ-లండన్ మధ్య విమాన సర్వీస్‌పై విస్తారా.. ఎకానమీ క్లాస్ టికెట్ ధర రూ.1,03,191 నుంచి రూ.1,21,356 వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది.
బ్రిటిష్ ఎయిర్వేస్ టికెట్ ధర రూ.1,28,916-1,47,544 పలుకుతున్నది. డీజీసీఏ పిలుపు మేరకు వివిధ విమానయాన సంస్థలు తమ టికెట్ల ధరలపై నివేదిక సమర్పించాయి.
ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తే రూ.1,15,936, వర్జిన్ అట్లాంటిక్‌లో ప్రయాణిస్తే రూ.1,28,916 చెల్లించి టికెట్ కొనుగోవాల్సి ఉంటుంది.
ఇప్పటికైతే వారానికి భారత్-బ్రిటన్ మధ్య 30 విమాన సర్వీసులు మాత్రమే నడుస్తాయి. విస్తారా అధికార ప్రతినిధి స్పందిస్తూ.. సప్లయ్, డిమాండ్ మధ్య టికెట్ల ధర ఖరారవుతుందన్నారు.
వారానికి కేవలం 15 విమాన సర్వీసులు మాత్రమే నడిపేందుకు అనుమతి లభించిందన్నారు విస్తారా అధికార ప్రతినిధి. మున్ముందు రెండు దేశాల విమాన సర్వీసులు పెరిగితే టికెట్ల ధరలు ఆటోమేటిక్‌గా తగ్గుముఖం పడతాయని పేర్కొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

