Microsoft Copilot+ PCs | ఏఐ కోసం మైక్రోసాఫ్ట్ కో పైలట్+ పీసీలు.. ఇందులో వచ్చే ఫీచర్లివే..!
Microsoft Copilot+ PCs | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కోసం మైక్రోసాఫ్ట్ కొత్తగా కోపైలట్+ పీసీలను ఆవిష్కరించింది. వివిధ సంస్థల సహకారంతో వస్తున్న ఈ పర్సనల్ కంప్యూటర్లు వచ్చేనెల 18 నుంచి అందుబాటులో ఉంటాయి.
Microsoft Copilot+ PCs | ప్రస్తుతం టెక్నాలజీ, ఐటీ, సాఫ్ట్ వేర్ రంగాల్లో కృత్రిమ మేథ ఫీచర్లకు గిరాకీ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. తన కస్టమర్ల కోసం కొత్తతరం పర్సనల్ కంప్యూటర్లు ఆవిష్కరించింది. కోపైలట్+ పీసీల (Microsoft Copilot PCs) అనే పేరుతో వీటిని తీసుకొస్తున్నది. ఇంత వరకూ ఆవిష్కరించిన పర్సనల్ కంప్యూటర్లతో పోలిస్తే ఈ పర్సనల్ కంప్యూటర్లు అత్యంత శక్తిమంతమైనవి, వేగవంతమైనవని మైక్రోసాఫ్ట్ తెలిపింది.
స్నాప్ డ్రాగన్ ఎక్స్ సిరీస్ ప్రాసెసర్లతో కోపైలట్+ పీసీలను తయారు చేసింది. సెకన్ కు 40 లక్షల కోట్ల ఆపరేషన్స్ పూర్తి చేయడం వీటి స్పెషాలిటీ. వీడియో ఎడిటింగ్, క్లిష్టమైన డేటా అనాలసిస్, మల్టీపుల్ ప్రోగ్రామ్స్ రన్ వంటి పనుల్లో వేగంగా స్పందిస్తాయీ పర్సనల్ కంప్యూటర్లు.. దీర్ఘకాలిక లక్ష్యమైన ఏఐ పీసీల అభివ్రుద్ధిలో భాగంగా వీటిని ఆవిష్కరించినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. పూర్తి సామర్థ్యానికి అనుగుణంగా ఈ ఫీచర్లను వాడుకోవాలంటే అందుకు మద్దతునిచ్చే హార్డ్ వేర్ కూడా ఉండాలి. ఇందుకోసం మైక్రోసాఫ్ట్‌తో ఎసెర్, అసుస్, డెల్, హెచ్ పీ, లెనోవో, శాంసంగ్ వంటి సంస్థలు జత కట్టాయి. వచ్చేనెల 18 నుంచి కోపైలట్ + పీసీలు తెస్తాయి. మైక్రోసాఫ్ట్ కూడా ఈ క్యాటగిరీలో సర్ఫేస్ పేరుతో డివైజ్‌లు విడుదల చేస్తుంది.
మైక్రోసాఫ్ట్ కోపైలట్ + పీసీల్లో (Microsoft Copilot+ PCs) రీకాల్ అనే ఏఐ ఫీచర్ ఉంటది. దీంతో ఈ పీసీలో ఏ సమాచారమైనా వెంటనే పొందొచ్చు. ఫైల్, ఫోల్డర్, ఈ-మెయిల్ గుర్తించడంతోపాటు గతంలో మీరు పూర్తి చేసిన యాక్షన్లు, హిస్టరీ మీ ముందు నిలుపుతుంది. రిషేషన్ షిప్, అసోసియేషన్ల ఆధారంగా ఈ పీసీలు సమాచారం సేవ్ చేస్తాయి.
ఈ పర్సనల్ కంప్యూటర్లలో కోక్రియేట్ అనే ఏఐ ఫీచర్ ఉంటది. ఇది పెయింట్, ఫొటోస్ వంటి యాప్స్‌తో పని మెరుగు పరుస్తుంది. పెయింట్‌లో ఒక బొమ్మ గీస్తే.. ఏఐ కూడా తనంతటతానుగా మరో బొమ్మ గీసి చూపుతుంది. దాన్ని మనం టెక్ట్స్ కమాండ్లతో మెరుగు పరిచి వినియోగించుకోవచ్చు. పెయింట్ లోనూ ఫోటోను ఏఐ టూల్స్ ఎడిట్ చేసే సౌకర్యం ఉంటది. అడోబ్, క్యాప్ కట్, డావిన్సీ రిసాల్వ్ స్టూడియో, సెఫబుల్, లిక్విడ్ టెక్ట్స్ వంటి యాప్ సంస్థలతో మైక్రోసాఫ్ట్ జత కట్టింది. తద్వారా ఆయా యాప్‌లతో ఏఐ ఫీచర్లు అనుసంధానించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

