Mass Layoffs | మెటాలో మళ్లీ లేఆఫ్స్ కలకలం : 6000 మంది ఉద్యోగులపై వేటు
మెటా మరోసారి మాస్ లేఆఫ్స్‌కు (Mass Layoffs) తెగబడింది. మెటా భేటీలో కొలువుల కోతపై కంపెనీ గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్ నిక్ క్లెగ్ ఉద్యోగులకు ఈ విషయం స్పష్టం చేసినట్టు సమాచారం.
న్యూయార్క్ : మెటా మరోసారి మాస్ లేఆఫ్స్‌కు (Mass Layoffs) తెగబడింది. మెటా భేటీలో కొలువుల కోతపై కంపెనీ గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్ నిక్ క్లెగ్ ఉద్యోగులకు ఈ విషయం స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ ఏడాది మేలో తదుపరి దశ లేఆఫ్స్ ఉంటాయని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల ప్రకటించగా ఆ దిశగానే తాజా లేఆఫ్స్‌ను కంపెనీ తెరలేపింది. వచ్చే వారం నుంచి 6000 మంది ఉద్యోగులను మెటా తొలగిస్తుందని చెబుతున్నారు.
ఇక మెటా గత ఏడాది నవంబర్‌లో 11,000 మంది ఉద్యోగులను కంపెనీ తొలగించగా 10,000 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్టు ఈ ఏడాది మార్చిలో ప్రకటించింది. ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా ఇప్పటికే 4000 మంది ఉద్యోగులను తొలగించగా మరో 6,000 మంది ఉద్యోగులను త్వరలో సాగనంపనుంది. థర్డ్ వేవ్ లేఆఫ్స్ వచ్చే వారం నుంచే ప్రారంభమవుతాయని తెలిసింది. తన విభాగంతో పాటు అన్ని బిజినెస్ టీముల నుంచి ఉద్వాసన తప్పదని నిక్ క్లెగ్ చెప్పుకొచ్చారు.
తాజా లేఆఫ్స్ ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎవరెవరు లేఆఫ్స్‌తో ప్రభావితమవుతారనే వివరాలను సీనియర్లు త్వరలోనే ఉద్యోగులకు ఓ నోట్ పంపనున్నారు. ఆపై లేఆఫ్స్ బాధితులకు కంపెనీ ఈమెయిల్లో సమాచారం అందిస్తుందని తెలసింది. గతంలో మెటా తొలగించిన ఉద్యోగులకు కంపెనీ పరిహార ప్యాకేజ్ అందించగా తాజా లేఆఫ్స్‌లోనూ అదే పరిహార ప్యాకేజ్‌ను వర్తింపచేస్తారా అనే విషయంలో కంపెనీ వర్గాలు స్పష్టత ఇవ్వలేదు. ఆర్ధిక మందగమనం, ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడుతున్న క్రమంలో లేఆఫ్స్‌ను మెటా కొనసాగిస్తోందని చెబుతున్నారు.
Read More
Layoffs | 3000 మంది ఉద్యోగులను తొలగించిన క్లౌడ్ దిగ్గజం
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

