Meta AI – Lama-2 | ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీ సక్సెస్ తర్వాత టెక్నాలజీ సంస్థలన్నీ సొంతంగా ఏఐ ఆధారిత లాంగ్వేజ్ యూజర్లకు అందుబాటులోకి తేవడంపై ఫోకస్ చేశాయి. ఆ జాబితాలో ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ పేరెంట్ సంస్థ మెటా చేరింది. తమకంటూ సొంతంగా ‘లామా-2’ పేరుతో ఏఐ లాంగ్వేజ్ ఆవిష్కరించింది. ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీ, గూగుల్ బార్డ్లతో పోలిస్తే మెటా ‘లామా-2’ ఏఐ టూల్.. కేవలం రీసెర్చ్, వాణిజ్య అవసరాలకు మాత్రమే ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు. ఇది నెక్ట్స్ జనరేషన్ ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్ ‘ఏఐ’ టూల్ అని మెటా ప్రకటించింది. ఇందుకోసం సత్య నాదెళ్ల సారధ్యంలోని మైక్రోసాఫ్ట్’తో జత కట్టింది.
పలువురు డెవలపర్లు ‘న్యూ టెక్నాలజీ’ని తమ లామా-2 ఏఐ లాంగ్వేజ్ అందుబాటులో ఉంటుందని, ‘‘ఇన్నోవేషన్’ను ప్రోత్సహిస్తుందని మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తన ఫేస్ బుక్ ఖాతాలో రాసుకొచ్చారు. దీనికి సెక్యూరిటీ ఉంటుందని తెలిపారు.
‘లామా-2’ ప్రారంభం కోసం మైక్రోసాఫ్ట్‌తో మెటా కలిసి పని చేస్తుందని మార్గ్ జుకర్ బర్గ్ తెలిపారు. మీడియా కథనం ప్రకారం మైక్రోసాఫ్ట్, మెటా కలిసి ‘లామా-2’ టీం ఏర్పాటు చేశాయని సమాచారం. మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ సర్వీసులో ‘లామా-2’ యాక్సెస్ అవుతుందని తెలుస్తున్నది.