Reliance | గతవారం ట్రేడింగ్లో టాప్-10 సంస్థల్లో రిలయన్స్ మినహా, తొమ్మిది సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.51 లక్షల కోట్లు పెరిగింది. వాటిల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అతిపెద్ద లబ్ధిదారుగా నిలిచింది. గతవారం బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 1,367 (2.60 శాతం) పాయింట్ల లాభంతో ముగిసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనీ లివర్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు బాగా లబ్ధి పొందగా, కేవలం రిలయన్స్ మాత్రమే నష్టపోయింది. రిలయన్స్ ఎం-క్యాప్ రూ.59,901.07 కోట్లు లాస్ అయ్యింది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.74,534.87 కోట్లు పెరిగి రూ.12,04,907.32 కోట్లకు చేరుకున్నది. హిందూస్థాన్ యూనీలివర్ (హెచ్యూఎల్) ఎం-క్యాప్ రూ.44,888.95 కోట్లు లాభ పడి రూ.5,41,240.10 కోట్ల వద్ద స్థిర పడింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 35,427.18 కోట్లు వృద్ధి చెంది రూ.7,51,800.31 కోట్ల వద్ద ముగిసింది. హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) ఎం-క్యాప్ రూ.24,747.87 కోట్లు పెరిగి రూ. 3,97,190.50 కోట్లకు చేరుకున్నది.
ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.22,888.49 కోట్లు పెరిగి రూ.6,06,734.50 కోట్లకు చేరుకుంది. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.17,813.78 కోట్లు లాభ పడి రూ.4,96,354.36 కోట్ల వద్ద స్థిర పడింది. భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15,185.45 కోట్లు లబ్ధి పొంది రూ.3,68,789.63 కోట్ల వద్ద ముగిసింది.
భారతీయ స్టేట్ బ్యాంక్ ఎం క్యాప్ రూ.11,914.36 కోట్ల లబ్ధితో రూ.4,05,489.73 కోట్లకు చేరింది. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,427.5 కోట్లు పెరిగి రూ.4,18,525.10 కోట్ల వద్ద స్థిర పడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.59,901.07 కోట్లు పతనమై రూ.16,91,785.45 కోట్ల వద్ద ముగిసింది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత రిలయన్స్ లీడ్లో కొనసాగుతుండగా, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ఐసీ, భారతీయ స్టేట్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ నిలిచాయి.