Market Capitalisation | ఐసీఐసీఐ -హెచ్డీఎఫ్సీ బ్యాంకులకు లబ్ధి.. రిలయన్స్- టీసీఎస్లకు నష్టం..!
Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈలోని టాప్-10 కంపెనీల్లో నాలుగు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.81,151 కోట్లు వృద్ధి చెందింది.
Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈలోని టాప్-10 కంపెనీల్లో నాలుగు కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.81,151 కోట్లు వృద్ధి చెందింది. వాటిల్లో ప్రైవేట్ బ్యాంకులు ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు భారీగా లాభ పడ్డాయి. గతవారం బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 151.61 పాయింట్ల నష్టంతో ముగిసింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంకు, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంకు, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) మార్కెట్ క్యాపిటలైజేషన్ పుంజుకున్నది. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), ఐటీసీ, భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) కలిసి రూ.76,622.05 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి.
ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.28,495.14 కోట్ల లాభంతో రూ.8,90,191,38 కోట్లకు చేరుకున్నది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.23,579.11 కోట్లు వృద్ధి చెంది రూ.12,82,848.30 కోట్ల వద్ద ముగిసింది. ఎస్బీఐ ఎం-క్యాప్ రూ.17,804.61 కోట్లు పెంచుకుని రూ.7,31,773.56 కోట్ల వద్ద నిలిచింది. భారతీ ఎయిర్ టెల్ ఎం-క్యాప్ రూ.11,272.45 కోట్లు పుంజుకుని రూ.9,71,707.61 కోట్ల వద్ద ముగిసింది.
మరోవైపు, ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.23,314.31 కోట్ల నష్టంతో రూ.7,80,126.10 కోట్ల వద్ద స్థిర పడింది. రిలయన్స్ ఎం-క్యాప్ రూ.16,645.39 కోట్ల పతనంతో రూ.18,38,721.14 కోట్ల వద్ద నిలిచింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) ఎం-క్యాప్ రూ.15,248.85 కోట్ల నష్టంతో రూ.6,38,066.75 కోట్లకు చేరుకున్నది.
టీసీఎస్ ఎం-క్యాప్ రూ.10,402.01 కోట్ల పతనంతో రూ.14,91,321.40 కోట్లకు చేరుకున్నది. ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8,760.12 కోట్లు కోల్పోయి రూ.5,91,418.91 కోట్ల వద్ద ముగిసింది. ఐటీసీ ఎం-క్యాప్ రూ.2,251.37 కోట్ల నష్టంతో రూ.6,08,682.29 కోట్ల వద్ద ముగిసింది. గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ టాప్-10 సంస్థల్లో రిలయన్స్ మొదటి స్థానంలో కొనసాగుతున్నది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హిందూస్థాన్ యూనీ లివర్, ఐటీసీ, ఎల్ఐసీ నిలిచాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

