Maruti 7-seater Grand Vitara | ఆ ఆరు కార్లతో మారుతి 7-సీటర్ గ్రాండ్ విటారా ‘సై’.. మార్కెట్లోకి ఎప్పుడొస్తుందో తెలుసా..?!
Maruti 7-seater Grand Vitara | అన్ని సెగ్మెంట్లలో పట్టు సాధించిన మారుతి సుజుకి కంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో 7-సీటర్ గ్రాండ్ విటారా కారు వచ్చే ఏడాది మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Maruti 7-seater Grand Vitara | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి రోజురోజుకు వస్తున్న టెక్నాలజీకి, కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త మోడల్ కార్లను తయారు చేస్తూనే ఉంది. ఇప్పటికే కంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో పట్టు సాధించిన గ్రాండ్ విటారా.. ప్రత్యర్థి సంస్థల కార్లు టాటా నెక్సాన్, హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్ మోడల్స్‌కు గట్టి పోటీ ఇస్తోంది. ఈ క్రమంలో 7-సీటర్ మోడల్ గ్రాండ్ విటారా (వై17) కారు ఆవిష్కరణకు సిద్ధం అవుతున్నది. వచ్చే ఏడాది (2025)లో 7-సీటర్, 6-సీటర్ గ్రాండ్ విటారా కార్లను ఆవిష్కరించనున్నదని తెలుస్తున్నది.
1.5 లీటర్ల ఫోర్ సిలిండర్ కే15సీ మైల్డ్ హైబ్రీడ్ పెట్రోల్, 1.5 లీటర్ల త్రీ సిలిండర్ స్ట్రాంగ్ హైబ్రీడ్ పెట్రోల్ ఇంజిన్లతో తొలుత 7-సీటర్ గ్రాండ్ విటారాను మార్కెట్లోకి తేనున్నట్లు తెలుస్తున్నది. గత నెలలో గ్రాండ్ విటారా 6,988 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇక లో, మిడ్ స్పెషిఫికేషన్ వేరియంట్లలో కే15సీ డ్యుయల్ జెట్ వీవీటీ స్మార్ట్ హైబ్రీడ్ పెట్రోల్ ఇంజిన్, టాప్ హై ఎండ్ ట్రిమ్స్ కార్లలో టయోటా కిర్లోస్కర్ మోటార్స్ అభివ్రుద్ధి చేసిన అత్యంత శక్తిమంతమైన హైబ్రీడ్ ఇంజిన్ జత చేస్తారని తెలుస్తున్నది. టయోటా హైరైడర్ నుంచే మారుతి సుజుకి గ్రాండ్ విటారా అర్బన్ క్రూయిజర్ రూపుదిద్దుకున్నది.
ఒకవేళ 7-సీటర్ మారుతి సుజుకి గ్రాండ్ విటారా (వై17) మార్కెట్లో ఎంటరైతే ఆ సంస్థ నుంచి అత్యంత పొడవైన ఐసీఈ ఎస్‌యూవీగా నిలువనున్నది. దీని ధర రూ.15 లక్షలు దాటుతుందని అంచనా వేస్తున్నారు. 7-సీటర్ మారుతి గ్రాండ్ విటారా కారు టాటా సఫారీ, ఎంజీ హెక్టర్ ప్లస్, సిట్రోన్ సీ ఎయిర్ క్రాస్, మహీంద్రా ఎక్స్‌యూవీ700, హ్యుండాయ్ అల్కాజర్, త్వరలో మార్కెట్లోకి రానున్న రెనాల్ట్ డస్టర్ మోడల్ కార్లతో పోటీ పడనున్నది.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న గ్రాండ్ విటారా మాదిరిగానే ఉన్నా ఎస్ఆర్కే డిజైన్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న మారుతి సుజుకి వై17 (7-సీటర్ గ్రాండ్ విటారా) పొడవుగా ఉంటుంది. సుజుకి బ్యాడ్జెస్తో థిక్ క్రోమ్ బార్, బ్లాక్ హెక్సాగోనల్ గ్రిల్లె సెక్షన్, షార్ప్ ట్రిపుల్ బీం ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, వెర్టికల్ ఎల్ఈడీ ఫాగ్ లాంప్స్, వైడర్ లోయర్ ఎయిర్ ఇన్ టేక్, మస్క్యులర్ బాయ్నెట్ తదితర ఫీచర్లు ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

