Maruti Grand Vitara | ఎస్యూవీ క్యాటగిరీలో వివిధ కార్ల తయారీ సంస్థల మధ్య పోటీ తీవ్రమైంది. కియా సెల్టోస్, హ్యుండాయ్ క్రెటా, స్కోడా కుషక్, ఫోక్స్ వ్యాగన్ టైగోన్, నిస్సాన్ కిక్స్, టాటా హారియర్, ఎంజీ అస్టర్లతో పోటీ పడేందుకు మారుతి సుజుకి సిద్ధమైంది. తాజాగా డిజైన్ చేసిన ఎస్యూవీ కారు గ్రాండ్ విటారాను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.10.45 లక్షల నుంచి మొదలవుతుంది. స్మార్ట్ హైబ్రీడ్ ఎస్యూవీ కారు ఇంజిన్ క్విక్‌గా ఇంజిన్ నుంచి ఎలక్ట్రిక్ డ్రైవ్ మోడ్‌లోకి షిఫ్ట్ అవుతుంది. మారుతి గ్రాండ్ విటారా కారు పది వేరియంట్లలో, మూడు డ్యుయల్, 6 సింగిల్ కలర్ ఆప్షన్లలో లభ్యం అవుతాయి. గ్రాండ్ విటారా లీటర్ పెట్రోల్‌పై 27.97 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.
లిథియం అయాన్ బ్యాటరీతోపాటు మారుతి సుజుకి గ్రాండ్ విటారా-2022 కారులో సెల్ఫ్ చార్జి బ్యాటరీ, సన్‌రూఫ్ ఉంటాయి. ఈ స్మార్ట్ హైబ్రీడ్ ఎస్యూవీ కారు పెట్రోల్ ఇంజిన్ అండ్ మోటార్‌తో శక్తిమంతం అవుతుంది. బ్యాటరీ దానంతట అదే చార్జి అవుతుంది. సన్‌రూఫ్ ఫీచర్‌తోపాటు వెంటిలేటెడ్ సీట్లు, మల్టీపుల్ డ్రైవింగ్ మోడ్స్, 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్చ్ కన్వర్టర్ ఆటోమాటిక్ గేర్ బాక్స్ తదితర ఫీచర్లు జత చేశారు.
ఎల్ఈడీ లైట్ బార్‌తోపాటు సేఫ్టీ కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, అల్లాయ్ వీల్స్, సీ-పిల్లార్ క్రోమ్ వర్క్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ క్రోమ్ లైన్డ్ హెక్సాగోనల్ గ్రిల్లే, ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, 17- అంగుళాల అల్లాయ్ వీల్స్, బంపర్స్పై హెడ్‌ల్యాంప్ క్లస్టర్, టయోటా హైరైడర్‌లో మాదిరిగా రేర్ అండ్ సైడ్ బాడీ పానెల్స్ ఉన్నాయి.
గ్రాండ్ విటారా-2022 కారులో 7- అంగుళాల మల్టీ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే, హిల్ హోల్డ్ అసిస్ట్, రేర్ డిస్క్ బ్రేక్, హిల్ డిస్సెంట్ కంట్రోల్, టీపీఎంఎస్, డిజిటల్ క్లస్టర్, నెక్స్ట్రీ 3డీ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా, వైర్లెస్ చార్జర్, సుజుకి కనెక్ట్ తదితర ఫీచర్లు కూడా ఉన్నాయి.
గ్రాండ్ విటారా-2022 కారు రెండు పవర్ ట్రైన్ ఆప్షన్లలో లభిస్తుంది. నాలుగు రకాల డ్రైవింగ్ మోడ్లు ఈవీ, ఎకో, పవర్, నార్మల్ డ్రైవ్ మోడ్ల్లో పొందొచ్చు. 1.5 లీటర్ల హైబ్రీడ్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ల డ్యుయల్ వీవీటీ పెట్రోల్ ఇంజిన్ కూడా ఉన్నాయి. ఈ కారు కొనుగోలు చేయాలన్న ఆసక్తి గల వారి కోసం గత జూలై 11 నుంచి రూ.11 వేల పేమెంట్‌తో ప్రీ బుకింగ్స్‌ను ప్రారంభించింది మారుతి సుజుకి. ప్రస్తుత పండుగల సీజన్లో డెలివరీ చేయనున్నది.