Maruti Suzuki | న్యూఢిల్లీ, మార్చి 22: బాలెనో, వ్యాగన్ఆర్ మాడళ్లకు చెందిన 16 వేల యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు మారుతి సుజుకీ ప్రకటించింది.
ఫ్యూయల్ పంప్ మోటార్‌కు సంబంధించి తలెత్తిన సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో జూలై 30, 2019 నుంచి నవంబర్ 1, 2019 వరకు తయారైన 11,851 యూనిట్ల బాలెనో, 4,190 యూనిట్ల వ్యాగన్ఆర్ మాడళ్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు తెలిపింది.