Maruti Suzuki | సెప్టెంబర్ సేల్స్‌లో రికార్డు.. కానీ.. ఉత్పత్తి తగ్గిందన్న మారుతి.. కారణాలివే..!
Maruti Suzuki | గత నెల కార్ల విక్రయాల్లో మరోమారు రికార్డు నెలకొల్పినా.. 2022 సెప్టెంబర్ నెలతో పోలిస్తే గత నెలలో ఒక శాతం కార్ల ఉత్పత్తి తగ్గిందని మారుతి సుజుకి వెల్లడించింది.
Maruti Suzuki | దేశీయ కార్ల మార్కెట్లో రారాజు మారుతి సుజుకి. 2022తో పోలిస్తే గత నెల కార్ల విక్రయాల్లోనూ సరికొత్త రికార్డు నెలకొల్పింది. కానీ.. గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే గత నెలలో కార్ల ఉత్పత్తి ఒక శాతం తగ్గినట్లు స్వయంగా మారుతి సుజుకి మంగళవారం వెల్లడించింది. గత నెలలో మొత్తం 1,74,978 కార్లు తయారు చేసింది. గతేడాది 1,77,468 కార్లను ఉత్పత్తి చేసింది. గత నెలలో ఎంట్రీ లెవల్ ఆల్టో, ఎస్-ప్రెస్సో కార్ల ఉత్పత్తి 70 శాతం తగ్గి.. 35,887 యూనిట్ల నుంచి 10,705 యూనిట్లకు పడిపోయినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
అలాగే బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, వ్యాగన్-ఆర్ వంటి మోడల్ కార్లు 92,717 యూనిట్ల నుంచి 90,849 యూనిట్లకు తగ్గాయి. మిడ్‌సైజ్ సెడాన్ కారు సియాజ్ 2654 నుంచి 2,304 యూనిట్లకు దిగి వచ్చాయి. మొత్తం ప్యాసింజర్ కార్ల ఉత్పత్తి 1,31,258 యూనిట్ల నుంచి 1,03,858 యూనిట్లకు పడిపోయింది.
మరోవైపు బ్రెజా, గ్రాండ్ విటారా, ఎర్టిగా, జిమ్నీ వంటి యుటిలిటీ వెహికల్స్ ఉత్పత్తి 29,811 యూనిట్ల నుంచి 56,579 యూనిట్లకు పెరిగింది. గతేడాది మొత్తం 1,73,929 యూనిట్ల నుంచి స్వల్పంగా తగ్గి.. 1,73,451 యూనిట్లకు పడిపోయింది. లైట్ కమర్షియల్ వెహికల్ `సూపర్ క్యారీ` వ్యాన్ల ఉత్పత్తి 3,539 యూనిట్ల నుంచి 1,527 యూనిట్లకు దిగి వచ్చింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Basar IIIT | బాసర ట్రిపుల్ ఐటీకి నీటి కరువు.. నీటి సమస్యతో తరగతులు బంద్
Cyclone Arnab | ‘అర్ణబ్’తో కోస్తాంధ్రకు వణుకు వాతావరణ శాఖ హైఅలర్ట్
Land Scam | అసైన్డ్ ఖల్లాస్.. 1000 కోట్ల విలువైన లావణి భూముల్లో బిగ్ విల్లాస్!.. మంఖాల్‌లో భూ కైంకర్యం
Horoscope | 26-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
ఆ ఆలస్యం నాకిష్టంలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

