Maruti Suzuki | న్యూఢిల్లీ, జూలై 31: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ రికార్డు స్థాయి లాభాలను గడించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.2,525 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైనరూ.1,036 కోట్ల లాభంతో పోలిస్తే రెండు రెట్లు పెరిగినట్లు వెల్లడించింది. అమ్మకాలు భారీగా పుంజుకోవడం, ఖర్చులు తగ్గించుకోవడం, ఆపరేటింగేతర ఆదాయం భారీగా పెరగడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.26,512 కోట్ల నుంచి రూ.32,338 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది.