Maruti Swift | న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ.. ప్రత్యేకంగా రెండు మాడళ్ల ధరలను పెంచింది. తన హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్‌తోపాటు ఎస్యూవీ గ్రాండ్ విటారా మాడళ్ల ధరలను రూ.25 వేల వరకు సవరించింది. వీటిలో స్విఫ్ట్ ధరను రూ.25 వేలు పెంచిన సంస్థ..గ్రాండ్ విటారా మాడల్‌ను రూ.19 వేలు అధికం చేసినట్లు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. దీంతో స్విఫ్ట్ మాడల్ ధర రూ.5.99 లక్షల నుంచి రూ.8.89 లక్షలకు, సిగ్మా రకం గ్రాండ్ విటారా మాడల్ రూ.10.8 లక్షలకు చేరుకున్నది. ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి.