Maruti Suzuki Ertiga | మారుతి సుజుకి ఎర్టిగా ధర పిరం.. గరిష్టంగా ఎంత పెరుగుతుందంటే..?!
Maruti Suzuki Ertiga | దేశంలోని అత్యంత సక్సెస్ఫుల్ ఎంపీవీ కార్లలో మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) ఒకటి. ఈ కారు ధర ఈ నెల నుంచి రూ.15 వేలు పెరిగింది.
Maruti Suzuki Ertiga | దేశంలోని అత్యంత సక్సెస్ఫుల్ ఎంపీవీ కార్లలో మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) ఒకటి. ఈ కారు ధర ఈ నెల నుంచి రూ.15 వేలు పెరిగింది. మారుతి సుజుకి ఎర్టిగా ఎల్ఎక్స్ఐ (LXI), వీఎక్స్ఐ (VXI), జడ్ఎక్స్ఐ (ZXI), జడ్ఎక్స్ఐ ప్లస్ (ZXI Plus) వేరియంట్ల ధరలు పెరిగాయి. దీంతో వేరియంట్ల వారీగా మారుతి సుజుకి ఎర్టిగా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా..!
ఎర్టిగా కార్ల ధరల పెరుగుదలకు మారుతి సుజుకి ఎటువంటి కారణం చెప్పలేదు. త్రీ-రో మారుతి సుజుకి ఎర్టిగా కారు ధర రూ.10 వేలు పెరిగింది. ఎంట్రీ లెవల్ ఎల్ఎక్స్ఐ (ఓ) వేరియంట్ రూ.15 వేలు వృద్ధి చెందింది. దీంతో మారుతి సుజుకి ఎర్టిగా కారు ధర రూ.8.84 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. మిగతా అన్ని వేరియంట్లు రూ.10 వేలు పెరుగుతాయి.
మోడల్ – ధర (రూ. లక్షల్లో)
ఎర్టిగా ఎల్ఎక్స్ఐ (ఓ) – రూ.8.84 లక్షలు.
ఎర్టిగా వీఎక్స్ఐ (ఓ) – రూ. 9.93 లక్షలు.
ఎర్టిగా జడ్ఎక్స్ఐ (ఓ) – రూ.11.03 లక్షలు
ఎర్టిగా జడ్ఎక్స్ ఐ + – రూ. 11.73 లక్షలు
ఎర్టిగా వీఎక్స్ఐ ఏటీ – రూ.11.33 లక్షలు
ఎర్టిగా జడ్ఎక్స్ఐ ఏటీ – రూ.12.43 లక్షలు
ఎర్టిగా జడ్ఎక్స్ఐ ప్లస్ ఏటీ – రూ.13.13 లక్షలు
ఎర్టిగా వీఎక్స్ఐ (ఓఏ) సీఎన్జీ – రూ.10.88 లక్షలు
ఎర్టిగా జడ్ఎక్స్ఐ (ఓ) సీఎన్జీ – రూ. 11.98 లక్షలు
మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) రెండు పవర్ ట్రైన్ ఆప్షన్లు – 1.5-లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లలో లభిస్తుంది. పెట్రోల్ వర్షన్ ఇంజిన్ గరిష్టంగా 6,000 ఆర్పీఎం వద్ద 101.6 బీహెచ్పీ విద్యుత్, 4,400 ఆర్పీఎం వద్ద 136.8 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. ఈ కారు 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ ఆప్షన్లలో లభిస్తుంది. సీఎన్జీ ఇంజిన్ గరిష్టంగా 5,500 ఆర్పీఎం వద్ద 86.6 బీహెచ్పీ, 4,200 ఆర్పీఎం వద్ద 121.5 టార్క్ వెలువరిస్తుంది. సీఎన్జీ వర్షన్ కారు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లో లభిస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

