Maruti Recall | 1.81 లక్షల కార్లు రీకాల్ చేసిన సుజుకి..!
Maruti Recall |దేశీయ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఐదు మోడళ్లకు చెందిన 1,81,754 లక్షల కార్లను రీకాల్ చేస్తున్నట్లు ....

Maruti Recall | దేశీయ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఐదు మోడళ్లకు చెందిన 1,81,754 లక్షల కార్లను రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. సియాజ్, ఎర్టిగా, విటారా బ్రెజా, ఎస్-క్రాస్, ఎక్స్ఎల్6 మోడల్ కార్లలోని సేఫ్టీ ఫీచర్లలో లోపాలు ఉన్నాయని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. 2018 మే 4 నుంచి 2020 అక్టోబర్ 27 వరకు ఉత్పత్తి చేసిన ఈ ఐదు మోడల్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు వెల్లడించింది.
మోటార్ జనరేటర్ యూనిట్లో తనిఖీలు
వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛందంగా సేఫ్టీ ఫీచర్లలో లోపాలు ఉన్న కార్లను రీకాల్ ( Recall ) చేస్తున్నామని తెలిపింది. మోటార్ జనరేటర్ యూనిట్ వద్ద ఉచితంగా వీటిని తనిఖీ చేస్తారని పేర్కొంది. ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్ల యజమానులు తమ ఆథరైజ్డ్ మారుతి సుజుకి వర్క్‌షాప్ వద్ద సంప్రదించాలని సూచించింది.

జల సమ్మర్ధ ప్రాంతాలకు వెళ్లకండి…
ఈ వాహనాల తనిఖీ ప్రక్రియ వచ్చే నవంబర్ మొదటి వారం నుంచి ప్రారంభం అవుతుందని తెలిపింది. లోపాలు ఉన్న విడి భాగాన్ని నవంబర్ ఫస్ట్‌వీక్‌లో రీప్లేస్ చేస్తామని పేర్కొంది. వర్షాకాలం నేపథ్యంలో జల సమ్మర్ధ ప్రాంతాలకు వెళ్లరాదని, కారులోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ విడి భాగాలపై నేరుగా నీటిని స్ప్రే చేయరాదని సూచించింది.
వాహనదారులు ఇలా చెక్ చేసుకోవాలి
ఎర్టిగా, విటారా బ్రెజ్జా మోడల్ కార్ల వినియోగదారులు కంపెనీ వెబ్సైట్ www.marutisuzuki.com లో సియాజ్, ఎక్స్ఎల్6, ఎస్-క్రాస్ మోడల్ కార్ల కొనుగోలు దారులు www.nexaexperience.com లో తమ వాహనాల చాసిస్ నంబర్లు చెక్ చేసుకోవాలి. కార్లలో సమస్యలు తలెత్తితే.. వినియోగదారులు కారు చాసిస్ నంబర్, ఐడీ ప్లేట్ తదితర ముఖ్యమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని మారుతి సుజుకి తెలిపింది.
ఇవి కూడా చదవండి:
Smoking: వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా సరే స్మోకింగ్ చేయొద్దు.. ఓ కంపెనీ ఆదేశాలు
No vaccine No liquor: మద్యం కొనుగోలు చేయాలంటే వ్యాక్సిన్ తీసుకున్నట్టు ప్రూఫ్ చూపించాల్సిందే..!
MAA | ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామాలు..
Prabhas 25 |ప్రభాస్ 25వ సినిమాకు డిఫరెంట్ టైటిల్ .. భారీ సన్నాహాలు చేస్తున్న బడా ప్రొడ్యూసర్..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- maruti suzuki
- recall
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

