హైదరాబాద్, సెప్టెంబర్ 1: రాష్ర్టానికి చెందిన ప్రముఖ డ్రోన్ల సంస్థ మారుట్ డ్రోన్స్కు మరోసారి గుర్తింపు లభించింది. కంపెనీకి చెందిన ఏజీ-365 కిసాన్ డ్రోన్లకు డీజీసీఏ గుర్తించింది. తొలి మల్టీ-యుటిలిటీ అగ్రికల్చర్లో డీజీసీఏ నుంచి టైప్ సర్టిఫికేట్ పొందింది.
25 కిలోల లోపు విభాగంలో సంస్థ డ్రోన్లు 22 నిమిషాల పాటు నాణ్యమైన సేవలు అందించడం వల్లనే ఈ గుర్తింపును ఇస్తున్నట్లు డీజీసీఏ వర్గాలు వెల్లడించాయి.