Mahindra Thar | తేల్చి చెప్పిన మహీంద్రా.. 5-డోర్ థార్ ఆవిష్కరణ 2024లోనే
Mahindra Thar | 5-డోర్ థార్ వచ్చే ఏడాది (2024)లో మార్కెట్లోకి తెస్తామని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటో అండ్ ఫామ్ సెక్టార్ సీఈఓ రాజేష్ జెజూరికర్ స్పష్టం చేశారు.
Mahindra Thar | ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ‘మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra)’ వచ్చే ఏడాది అంటే 2024లో 5-డోర్ థార్ (Thar) ఆవిష్కరించనున్నట్లు తెలిపింది. ఈ ఏడాదిలోనే 5-డోర్ థార్ మార్కెట్లోకి రానున్నదని వార్తలొచ్చిన నేపథ్యంలో మహీంద్రా అండ్ మహీంద్రా ఆటో అండ్ ఫామ్ సెక్టార్ సీఈఓ రాజేష్ జెజూరికర్ స్పందిస్తూ.. 5-డోర్ థార్.. ఈ ఏడాదిలో మార్కెట్లోకి రావడం లేదని వెల్లడించారు. 2024లో మార్కెట్లోకి ఎంటరవుతుందన్నారు.
2020 అక్టోబర్‌లో 3-డోర్ మహీంద్రా మార్కెట్లోకి వచ్చింది. వచ్చేనెలలో మార్కెట్లోకి రానున్న మారుతిసుజుకి జిమ్నీకి తమ 5-డోర్ థార్ గట్టి పోటీదారుగా ఉంటుందన్నారు రాజేశ్ జెజూరికర్. ప్రారంభంలో 4డబ్ల్యూడీ స్లాండర్డ్ థార్ మోడల్ కారు ఆవిష్కరించిన మహీంద్రా.. ఈ ఏడాది ప్రారంభంలో పాపులర్ ఆఫ్ రోడర్ ఆర్డబ్ల్యూడీ వేరియంట్ మార్కెట్లోకి తెచ్చింది.
థార్ 5-డోర్ ఇంజిన్ మూడు ఆప్షన్లలో లభిస్తుంది.1.5 లీటర్ల డీ117 సీఆర్డీఈ డీజిల్ (117బీహెచ్పీ/300 ఎన్ఎం), 2.2 లీటర్ల ఎంహాక్ 130 సీఆర్డీఈ డీజిల్ (130 బీహెచ్పీ / 300 ఎన్ఎం), 2.0 లీటర్ల ఎంస్టాలియన్ 150 టీజీడీఐ పెట్రోల్ (150 బీహెచ్పీ/320 ఎన్ఎం) ఆప్షన్లలో లభిస్తుంది.
1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్ – స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 2.2 లీటర్ల డీజిల్ అండ్ 2.0-లీటర్ల పెట్రోల్ వేరియంట్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిష్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ చాయిస్ కలిగి ఉంటుంది. ఈ ఎస్యూవీ కారు 4డబ్ల్యూడీ, ఆర్డబ్ల్యూడీ ఆప్షన్లలో లభ్యం అవుతుంది. వేరియంట్‌ను బట్టి 16-అంగుళాలు లేదా 18-అంగుళాల వీల్స్ వస్తాయి. మహీంద్రా థార్ ధర రూ.10,54,500 నుంచి రూ.16,77,501 మధ్య పలుకుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

