సోమవారం 01 మార్చి 2021
Business - Dec 16, 2020 , 15:01:17

టాప్ గెయినర్స్ లిస్ట్ లో... ఎమ్ అండ్ ఎమ్, యూపీఎల్

టాప్ గెయినర్స్ లిస్ట్ లో... ఎమ్ అండ్ ఎమ్, యూపీఎల్

ముంబై :దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభం కావడంతో పలు కంపెనీల స్టాక్స్ లాభాల్లోనూ, మరికొన్ని సంస్థల స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. ప్రారంభ సెషన్ లో పీఎస్ యు బ్యాంకు మినహా మిగతా అన్ని రంగాలు లాభాల్లో ఉన్నాయి. ఆటో, మెటల్ రంగాలు భారీగా ఎగిశాయి. ఆ తర్వాత టాప్ గెయినర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా 2.62 శాతం, యూపీఎల్ 2.07 శాతం, దివిస్ ల్యాబ్స్ 2.04 శాతం, ఓఎన్జీసీ 1.99 శాతం, టాటా మోటార్స్ 1.96 శాతం ఉన్నాయి. నేటి లూజర్స్ జాబితాలో ఐచర్ మోటార్స్ 0.78 శాతం, టెక్ మహీంద్రా 0.76 శాతం, గెయిల్ 0.68 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.45 శాతం, హెచ్డీఫ్సీ లైఫ్ 0.38 శాతం నష్టపోయాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి... వేగం పుంజుకోనున్నభారత ఆర్థికవ్యవస్థ...
క్విజ్ లో గెలవండి.. రూ.25వేల అమెజాన్ పే బ్యాలెన్స్‌ పొందండి...
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు..

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి

VIDEOS

logo