Kinetic Luna | సింగిల్ ఛార్జింగ్‌తో 110 కి.మీ. నడిచే నయా లూనా.. రైతన్నలకు ఇదే బెస్ట్ ఛాయిస్!
Kinetic Luna | అప్పుడెప్పుడో 30-40 ఏండ్ల క్రితం మార్కెట్లో హల్చల్ చేసిన లూనా.. మళ్లీ కొత్త రూపులో ముందుకొచ్చింది. ‘ఈ-లూనా’ పేరుతో దీన్ని దేశీయ మార్కెట్‌కు బుధవారం కైనెటిక్ గ్రీన్ పరిచయం చేసింది.
Kinetic Luna | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: అప్పుడెప్పుడో 30-40 ఏండ్ల క్రితం మార్కెట్లో హల్చల్ చేసిన లూనా.. మళ్లీ కొత్త రూపులో ముందుకొచ్చింది. ‘ఈ-లూనా’ పేరుతో దీన్ని దేశీయ మార్కెట్‌కు బుధవారం కైనెటిక్ గ్రీన్ పరిచయం చేసింది. ఈ విద్యుత్తు ఆధారిత (ఈవీ) ద్విచక్ర వాహనం.. రైతులు, చిరు వ్యాపారుల వినియోగానికి, వస్తూత్పత్తుల డెలివరీలకు వీలుగా ఉన్నది.
వెనుక సీటును వేరుచేసుకునే సదుపాయం ఉన్న ఈ టూవీలర్‌పై సిలిండర్లు, పెట్టెలు, ఇతరత్రా సామాగ్రిని సులువుగా తరలించవచ్చని కంపెనీ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర రూ.69,990. మల్బెర్రీ రెడ్, ఓషియన్ బ్లూ, పియర్ల్ ఎల్లో, స్పార్క్లింగ్ గ్రీన్, నైట్ స్టార్ బ్లాక్ రంగుల్లో ఈ ఎలక్ట్రిక్ మోపెడ్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. ఒకినావా డ్యూయల్ 100, టీవీఎస్ ఎక్స్ఎల్ 100 తదితర మాడళ్లకు పోటీనివ్వగలదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రత్యేకతలు
- 2కిలోవాట్ సామర్థ్యం కలిగిన బ్యాటరీ.
- మార్పిడి సౌకర్యం.
- యూఎస్బీ చార్జింగ్ పోర్ట్.
- 4 గంటల్లో పూర్తిగా చార్జింగ్.
- ఒక్కసారి చార్జింగ్ చేస్తే 110 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.
- 1.2కిలోవాట్ మిడ్- మౌంటెడ్ మోటర్.
- గరిష్ఠ వేగం గంటకు 50 కిలోమీటర్లు.
- టెలిస్కోపిక్ ఫోర్క్, డ్యూయల్ షాక్ అబ్జర్బర్లు.
- 150 కిలోల వరకు బరువును మోయగలదు.
- సరకు రవాణా కోసం బ్యాగ్ హుక్స్.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

