వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపు.. తెలంగాణలో ఎంతంటే..?
న్యూఢిల్లీ : ఇప్పటికే వంటింట్లో ఉపయోగించే నూనెలు, పప్పు ధాన్యాల ధరలు అమాంతం పెరిగిన విషయం విదితమే. దీనికి తోడు వంట గ్యాస్ సిలిండర్ ధర కూడా పెరిగింది. 14 కేజీల వంట గ్యాస్ సిలిండర్‌పై రూ. 50 పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు వెల్లడించాయి. మొత్తంగా గ్యాస్ సిలిండర్ ధరలు రూ. వెయ్యికి పైగా పెరిగాయి.
తెలంగాణలో రూ. 1,002
పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరల పట్ల గృహిణులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వంట నూనెల ధరలు పెరగడంతో ఇబ్బందులు పడుతున్నామని, ఈ పరిస్థితుల మధ్య వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని మండిపడుతున్నారు. తెలంగాణలో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,002 కాగా, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 1,008కి చేరింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

