న్యూఢిల్లీ, మార్చి 12: తీవ్ర వివాదంలో చిక్కుకున్న పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు చెందిన పేటీఎం యాప్‌ను మార్చి 15 తర్వాత కూడా వినియోగదారులు ఉపయోగించుకునేందుకు మార్గం సుగమం అవుతున్నది. యూపీఐ ద్వారా పేటీఎం యాప్ నుంచి చెల్లింపులు చేసుకునేందుకు అవసరమైన థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (టీపీఏపీ) లైసెన్సుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ఆమోద ముద్ర వేయవచ్చని సంబంధిత వర్గా లు మంగళవారం వెల్లడించాయి. ఈ లైసెన్సుకు సంబంధించిన తనిఖీలు చాలావరకూ పూర్తయ్యాయని, మార్చి 15లోగా ఆమోదం లభించవచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అయితే రిజర్వ్‌బ్యాంక్ ఆదేశాల మేరకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మాత్రం మార్చి 15కల్లా బ్యాంకింగ్ కార్యకలాపాల్ని నిలిపివేయాలి.