Term Insurance | సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన ఇన్సూరెన్స్ పాలసీ ధరలు
Term Insurance | టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం ధరలు పెరిగాయి. భారీ సంస్థలైన హెచ్డీఎఫ్సీ లైఫ్, మ్యాక్స్ లైఫ్, బజాజ్ అలియాంజ్, టాటా ఏఐఏలు కనిష్ఠంగా 1 శాతం, గరిష్ఠంగా 10 శాతం వరకు పెంచినట్టు ప్రకటించాయి.
Term Insurance | న్యూఢిల్లీ, జూలై 10: టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం ధరలు పెరిగాయి. భారీ సంస్థలైన హెచ్డీఎఫ్సీ లైఫ్, మ్యాక్స్ లైఫ్, బజాజ్ అలియాంజ్, టాటా ఏఐఏలు కనిష్ఠంగా 1 శాతం, గరిష్ఠంగా 10 శాతం వరకు పెంచినట్టు ప్రకటించాయి. భారతీయ మూడో అతిపెద్ద జీవిత బీమా సంస్థ, రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ బీమా సంస్థ అయిన హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్.. తమ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంల ధరలను దాదాపు 10 శాతం మేర పెంచినట్టు చెప్తున్నారు. అయితే 60 ఏండ్లకుపైబడినవారికే ఈ పెంపు వర్తిస్తుందని అంటున్నారు. హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ మొత్తం వ్యక్తిగత వార్షిక ప్రీమియంల విలువలో 5 శాతానికి సమానంగా దాని టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంల వాటా ఉన్నది.
మిగతా వాటిలో..
మరో ప్రైవేట్ రంగ బీమా కంపెనీ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా తమ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంల ధరలను 1 నుంచి 6 శాతం మేర పెంచింది. ఆయా వయసులనుబట్టి ఈ పెంపులున్నాయి. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వ్యక్తిగత వార్షిక బీమా ప్రీమియంలలో టర్మ్ ఇన్సూరెన్స్ వాటా 9 శాతం. ఇక బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ పాలసీల రేట్లు 1 నుంచి 5 శాతం మేరకు పెరిగాయి. టాటా ఏఐఏ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలూ 3 శాతం నుంచి 10 శాతం వరకు పెరిగాయి. బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ వ్యక్తిగత వార్షిక ప్రీమియంలలో టర్మ్ ఇన్సూరెన్స్ వాటా 6 శాతంగా ఉన్నది.
ఇదే బాటలో..
మరికొన్ని కంపెనీలూ తమ బీమా ప్రీమియంల రేట్లను పెంచాలని చూస్తున్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్ పాలసీల ధరలు 3 శాతం నుంచి 5 శాతం వరకు పెరగవచ్చన్న సంకేతాలున్నాయి. అయితే ప్రభుత్వ రంగ బీమా సంస్థలు మాత్రం పెంపునకు నో అంటున్నాయి. ఎల్ఐసీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లు ఇప్పటికైతే పెంచబోవడం లేదంటున్నాయి. కాగా, విజృంభిస్తున్న ద్రవ్యోల్బణం, జనాభా, స్థిరం గా సాగతున్న రీఇన్సూరెన్స్ ఖర్చుల నేపథ్యంలోనే ప్రీమియంల ధరల్ని సవరించాల్సి వస్తున్నదని బీమా ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో టర్మ్ ఇన్సూరెన్స్లకు పెరుగుతున్న ఆదరణ కూడా రేట్ల పెంపునకు కారణమేనన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

