LIC-Health Insurance | ఆరోగ్య బీమాలోకి ఎల్ఐసీ.. కేంద్రం చట్టాన్ని సవరిస్తుందా..?!
LIC - Health Insurance | కేంద్ర ప్రభుత్వ రంగ బీమా సంస్థ భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ).. తాజాగా ఆరోగ్య బీమా రంగంలోకి ఎంటరయ్యేందుకు కసరత్తు చేస్తోంది.
LIC-Health Insurance | ఇటీవలి కాలంలో వైద్య ఖర్చులు భారీగా పెరిగాయి. కరోనా తర్వాత ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. వైద్య చికిత్స ఖర్చులు పెరిగిపోవడంతో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ప్రభుత్వం అధికారికంగా హెల్త్ ఇన్సూరెన్స్ అమలు చేస్తోంది. కార్పొరేట్, ప్రైవేట్ సంస్థల్లోనూ తమ సిబ్బందికి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ, ఇప్పటి వరకూ హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలో ప్రైవేట్ బీమా సంస్థలదే రాజ్యం.
దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ జీవిత బీమా సౌకర్యం అందుబాటులోకి తేవడంలో కీలకంగా వ్యవహరించిన భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ).. తాజాగా ఆరోగ్య బీమా రంగంలోకి ఎంటరయ్యేందుకు కసరత్తు చేస్తోంది. అందుకోసం ఇప్పటికే హెల్త్ ఇన్సూరెన్స్ సేవలు అందిస్తున్న బీమా సంస్థలను టేకోవర్ చేసుకునే అవకాశాలనూ ఎల్ఐసీ నిశితంగా పరిశీలిస్తోంది. హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలోకి కాంపోజింట్ ఇన్సూరెన్స్ సంస్థలను అనుమతించేందుకు కేంద్రం లైసెన్సులు మంజూరు చేయనున్నది. అందుకు అనుగుణంగా తమ సంస్థలో అంతర్గతంగా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించినట్లు ఎల్ఐసీ తెలిపింది.
‘మాకు సాధారణ బీమా రంగంలో అనుభవం తక్కువ. హెల్త్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్లో మాకు ఆసక్తి ఉంది. అసాధారణ వృద్ధి సాధించడానికి మాకు గల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మేం భావిస్తున్నాం’ అని ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ మొహంతి చెప్పారు. కాంపోజిట్ ఇన్సూరెన్స్ లైసెన్సులు మంజూరు చేసే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. దీనివల్ల ఆయా బీమా సంస్థలకు ఖర్చులు తగ్గడంతోపాటు నియంత్రణా పరమైన ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొంది. అయితే, ప్రస్తుత చట్టం ప్రకారం సాధారణ బీమా రంగ సంస్థలకు ఆరోగ్య బీమా రంగంలోకి ప్రవేశించడానికి అనుమతి లేదు. ఎల్ఐసీ వంటి బీమా సంస్థలకు అనుమతి ఇవ్వాలంటే బీమా రంగ చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

