హైదరాబాద్, డిసెంబర్ 2: దేశంలో అతిపెద్ద బీమా రంగ సేవల సంస్థ ఎల్ఐసీ మరో నూతన సేవలను ఆరంభించింది. పాత, కొత్త పాలసీ వివరాలు, ప్రీమియం, బోనస్ ఇతర సర్వీసులపై తన కస్టమర్లకు పూర్తి సమాచారం అందించేలా వాట్సప్ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై ప్రతి చిన్న పనికి ఆఫీస్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఏజెంట్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఈ నూతన సేవలను కంపెనీ చైర్మన్ ఎంఆర్ కుమార్ వాట్సప్ సేవలను శుక్రవారం ప్రారంభించారు. పాలసీ వివరాలను ఎల్ఐసీ పోర్టల్ రిజస్టర్ చేసుకున్న నంబర్ నుంచి 8976862090కు హాయ్ అని మేసేజ్ పంపిస్తే చాలు..పాలసీదారుడికి సంబంధించిన ఎలాంటి సమాచారాన్నైనా పొందవచ్చునన్నారు. ముఖ్యంగా ప్రీమియం బకాయిలు, బోనస్, పాలసీ స్థితితోపాటు రుణానికి సంబంధించిన సమాచారం, ప్రీమియం చెల్లింపు సర్టిఫికేట్ను పొందవచ్చును.