LIC IPO | ఎల్ఐసీ ఐపీవో లీగల్ అడ్వైజర్‌గా ఎవరంటే?!
LIC IPO | ఎల్ఐసీ ఐపీవో నిర్వహణ లీగల్ అడ్వైజర్‌గా సిరిల్ అమర్‌చంద్ మాణిక్ చంద్పేరు ఖరారైంది. 4వ క్వార్టర్లో ఐపీవోకెళ్లే చాన్సుంది.

LIC IPO | స్టాక్ మార్కెట్లో ఐపీవో దిశగా భారత జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) క్రమంగా ముందడుగు వేస్తున్నది. ఎల్‌సీఐ ప్రతిపాదిత మెగా ఐపీవో నిర్వహణకు లీగల్ అడ్వైజర్‌గా సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ కంపెనీ పేరు కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఎల్ఐసీ ఐపీవో లీగల్ అడ్వైజర్ హోదా కోసం నాలుగు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. వాటిలో క్రేఫోర్డ్ బేలే, సిరిల్ అమర్చందర్ మంగళ్‌దాస్, లింక్ లీగల్, శార్దూల్ అమర్చందర్ మంగళ్‌దాస్ అండ్ కో శనివారం డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) ముందు ప్రెజెంటేషన్లు ఇచ్చాయి. వీటిని పరిశీలించిన తర్వాత సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ కంపెనీని దీపం ఖరారు చేసిందని అధికారులు చెప్పారు.
ఇలా ఎల్ఐసీ ఐపీవో లీగల్ అడ్వైజర్ ఎంపిక
ఎల్ఐసీ ఐపీవో నిర్వహణకు లీగల్ అడ్వైజర్ల నియామకానికి అవసరమైన బిడ్ల దాఖలుకు దీపం అధికారులు గడువు రెండు మార్లు పొడిగించారు. తొలుత గత జూలై 15న బిడ్లను ఆహ్వానించిన దీపం.. విధించిన తొలి గడువు గత నెల 6తో గడువు ముగిసింది. సరైన స్పందన రాకపోవడంతో తొలుత సెప్టెంబర్ 6, తాజాగా 16కు పొడిగించింది. శనివారం దీపం అధికారుల ముందు ఆయా కంపెనీల అధికారులు ప్రెజెంటేషన్ తమకు నచ్చిందని సిరిల్ అమర్‌చంద్ మాణిక్ చంద్ సంస్థను ఎంపిక చేసింది.
10 మర్చంట్ బ్యాంకుల ఎంపిక
ఇప్పటికే ఎల్ఐసీ ఐపీవో నిర్వహణకు 10 మర్చంట్ బ్యాంకులను శనివారం దీపం ఎంపిక చేసింది. వాటిల్లో గోల్డ్‌మ్యాన్ సచేస్ గ్రూప్ ఇంక్, జేపీ మోర్గాన్ ఛేజ్ అండ్ కో, ఐఈఐసీఐ సెక్యూరిటీస్, కొటక్ మహీంద్రా క్యాపిటల్, జేఎం ఫైనాన్సయల్ లిమిటెడ్, నొమురా హోల్డింగ్స్ ఉన్నాయి.
ఎల్ఐసీ ఐపీవోను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో లిస్టింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయిన ఎల్ఐసీ ఐపీవోలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు అవకాశాలు కల్పించాలని కేంద్రం యోచిస్తున్నది. ఇతర సంస్థల మాదిరిగా ఎల్ఐసీలో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడానికి చట్టాలు అనుమతించవు.
జనవరి-మార్చి త్రైమాసికంలో ఎల్ఐసీ ఐపీవో
ఎల్ఐసీ ఐపీవో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఉండొచ్చునని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక ముఖ్య సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ సూచన ప్రాయంగా చెప్పారు. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ద్వారా 2021-22లో రూ.1.75 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఎల్ఐసీ ఆఫ్ ఇండియాలో వాటాల విక్రయం తప్పనిసరిగా పూర్తిచేయాలి. దీంతో కేంద్రం తన లక్ష్య సాధనకు అన్ని విధాలుగా సన్నాహలు చేస్తోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

