Lava O2 : దేశీ మార్కెట్లో లావా న్యూ స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసింది. లావా O2 పేరుతో నూతన స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసింది. ఈ సెగ్మెంట్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లావా ఫాస్టెస్ట్ ఫోన్‌గా చెబుతోంది. యూనిసోక్ ప్రాసెసర్, 50 ఎంపీ సెటప్, బాటమ్ ఫైరింగ్ స్పీకర్, టైప్ సీ యూఎస్బీ కేబుల్‌తో 18డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్, స్టాక్ అండ్రాయిడ్ 13, ఫేస్ అన్‌లాక్ వంటి ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్ కస్టమర్ల ముందుకొచ్చింది.
ఇక 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో పాటు మెరుగైన ఫీచర్లు ఆకట్టుకుంటాయని లావా పేర్కొంది. తమ స్మార్ట్ఫోన్లు స్టైల్‌తో పాటు మెరుగైన పనితీరుతో ఉండాలని ముఖ్యంగా యువ కస్టమర్లు కోరుకుంటారని, అలాంటి వారి కోసం అత్యాధునిక ఫీచర్లతో తాము లావా O2ను లాంఛ్ చేశామని లావా ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రోడక్ట్ హెడ్ సుమిత్ సింగ్ వెల్లడించారు.
50 ఎంపీ డ్యూయల్ ఏఐ కెమెరా ఆధునిక కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఆల్ ఇన్ వన్ సొల్యూషన్‌గా ఆకట్టుకుంటుందని లావా O2 ఫీచర్లను వెల్లడిస్తూ సింగ్ పేర్కొన్నారు. ఇక లావా O2 ధర రూ. 8999 కాగా ప్రారంభ ఆఫర్ కింద రూ. 7999 నుంచి అందుబాటులో ఉంటుంది.
Read More :
Divi Vadthya | చీరకట్టులో తడిసిన అందాలతో.. దివి వైద్య సొగసు చూడతరమా