కరోనాపై పోరుకు.. ఎస్బీఐ బిజినెస్ లోన్.. రూ.100 కోట్ల వరకూ..
కరోనాపై పోరుకు.. ఎస్బీఐ బిజినెస్ లోన్.. రూ.100 కోట్ల వరకూ..| ఎస్బీఐ.. తన ఖాతాదారుల కోసం.. ఆరోగ్యం హెల్త్‌కేర్ బిజినెస్ లోన్ ప్రారంభించింది. దేశంలో ...

న్యూఢిల్లీ/ ముంబై: దేశంలోనే అతిపెద్ద వాణిజ్య బ్యాంక్ ఎస్బీఐ.. తన ఖాతాదారుల కోసం.. ఆరోగ్యం హెల్త్‌కేర్ బిజినెస్ లోన్ ప్రారంభించింది. దేశంలో పర్యావరణ హిత హెల్త్ కేర్ సిస్టమ్‌కు మద్దతుగా దీన్ని డిజైన్ చేసింది ఎస్బీఐ.
టర్మ్‌లోన్‌గా క్యాష్ క్రెడిట్
తన ఖాతాదారులకు టర్మ్ రుణం.. బ్యాంక్ గ్యారంటీ అండ్ లెటర్ ఆఫ్ క్రెడిట్ రూపంలో క్యాష్ క్రెడిట్ ఇస్తుంది. దీని కింద కనిష్టంగా రూ.10 లక్షల వరకు, గరిష్ఠంగా రూ.100 కోట్ల వరకు రుణం తీసుకోవచ్చు. దీన్ని పదేండ్ల గడువులోపు తీర్చాల్సి ఉంటుంది. నూతన ఫెసిలిటీ ఏర్పాటు, హెల్త్‌కేర్ వసతుల విస్తరణకు ఈ రుణాన్ని ఖర్చు చేయొచ్చు.
హెల్త్ కేర్ రంగానికి మద్దతుగా బిజినెస్ లోన్
ఈ రుణ పరపతి స్కీమ్‌ను ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖరా ప్రారంభించారు. దేశంలోని హెల్త్‌కేర్ రంగానికి మద్దతుగా దీన్ని ప్రారంభించినట్లు తెలిపారు. దీని కింద దవాఖానలు, నర్సింగ్ హోంలు, డయాగ్నస్టిక్ కేంద్రాలు, పాథాలజీ ల్యాబ్స్, సప్లయర్స్, దిగుమతి దారులు, లాజిస్టిక్ కంపెనీలు రుణాలు తీసుకోవచ్చు.
చిన్న పట్టణాల్లో, పెద్ద నగరాల్లోనూ కనీస స్థాయిలో రూ.10 లక్షల రుణం తీసుకోవచ్చు. పెద్ద నగరాల్లో గరిష్ఠంగా రూ.100 కోట్ల వరకు రుణాలిస్తుంది.
రూ. 2 కోట్ల వరకు నో గ్యారంటీ
ఈ పథకం కింద దవాఖానల యూనిట్లు గానీ, కంపెనీలు గానీ రూ.2 కోట్ల రుణం వరకు గ్యారంటీ గానీ సెక్యూరిటీ గాని అందించాల్సిన అవసరం లేదు. సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు గ్యారంటీ స్కీం ఆఫ్ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ (సీజీటీఎంఎస్ఈ) కింద ఈ రుణాలు కవర్ అవుతాయి.
ఏడాది కాలంగా దేశీయంగా హెల్త్‌కేర్ వ్యవస్థ నిరంతరాయంగా మనకు మద్దతు తెలుపుతున్నదని దినేశ్ ఖరా చెప్పారు. కరోనాను ఎదుర్కొనేందుకే ఈ రుణ పరపతి అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు.
ఈ ప్రత్యేక రుణ ప్రొడక్ట్, అవసరమైన కంపెనీలకు సాయ పడుతుందన్నారు దినేశ్ ఖరా. ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా ఆరోగ్యం హెల్త్‌కేర్ బిజినెస్ లోన్ కింద ఈ రుణాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.
కరోనాపై పోరుకు పర్సనల్ లోన్ కూడా
హెల్త్‌కేర్ రంగానికి బిజినెస్ లోన్ మాదిరిగానే కరోనా బారిన పడ్డ రోగులకు రూ.5 లక్షల వరకు పర్సనల్ లోన్ ఇస్తున్నట్లు ఎస్బీఐ ఇంతకుముందు ప్రకటించింది. దీనిపై 8.5 శాతం వడ్డీ వసూలు చేస్తారు. ఐదేండ్ల గడువులోగా దీన్ని తీర్చాల్సి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- business loan
- health care
- sbi
RELATED ARTICLES
తాజా వార్తలు
Man Kills Nephew To Sell Organs | అవయవాలు అమ్మి డబ్బు సంపాదించేందుకు.. బాలుడిని చంపిన బంధువు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
MLA Sudheer Reddy | సాగు, తాగు నీరందకుండా చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

