Lamborghini | లంబోర్గిని సూపర్ సేల్స్ : 2023లో 10,000పైగా కార్ల విక్రయం
Lamborghini : లగ్జరీ స్పోర్ట్స్ కార్ తయారీ కంపెనీ లంబోర్గిని (Lamborghini) చరిత్రలోనే తొలిసారిగా ఒక క్యాలెండర్ సంవత్సరం 2023లో ఏకంగా 10,000కు పైగా యూనిట్లను విక్రయించి సరికొత్త రికార్డు నెలకొల్పింది.
Lamborghini : లగ్జరీ స్పోర్ట్స్ కార్ తయారీ కంపెనీ లంబోర్గిని (Lamborghini) చరిత్రలోనే తొలిసారిగా ఒక క్యాలెండర్ సంవత్సరం 2023లో ఏకంగా 10,000కు పైగా యూనిట్లను విక్రయించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. 2023లో లంబోర్గిని పది శాతం వృద్ధితో 10,112 కార్లను విక్రయించింది. ఇటాలియన్ లగ్జరీ కార్ బ్రాండ్ 2023లో 60వ వార్షికోత్సవ వేడుకలను కూడా జరుపుకోవడం విశేషం. రికార్డు స్ధాయిలో లంబోర్గిని కార్లు సేల్ అవగా యూరప్ నుంచే అధిక సంఖ్యలో కార్ల విక్రయం నమోదైంది.
యూరప్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా (ఈఎంఈఏ) ప్రాంతం నుంచి 3987 యూనిట్లు, అమెరికా నుంచి 3465 యూనిట్లు సేల్ అయ్యాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి 2660 యూనిట్లను విక్రయించారు. ఇక ఈఎంఈఏ ప్రాంతం లంబోర్గిని వాహన విక్రయాల్లో 14 శాతం వృద్ధి సాధించగా, అమెరికాలో 9 శాతం, ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి 4 శాతం వార్షిక వృద్ధి నమోదైంది.
ఇక దేశాల వారీగా చూస్తే 3000 కార్ల విక్రయాలతో అమెరికా టాప్ మార్కెట్గా నిలిచింది. జర్మనీలో 961 కార్లు, చైనా నుంచి 845 కార్లు, బ్రిటన్లో 801 కార్లు, జపాన్ 660 కార్లు, ఇటలీ 409 కార్లు, కెనడా 357 కార్లు, ఆస్ట్రేలియా 236 కార్లు, ఫ్రాన్స్ 255 కార్లు, స్విట్జర్లాండ్ 211 కార్లు విక్రయించగా తైవాన్లో 131 కార్లు, భారత్లో 103 లంబోర్గిని కార్ల విక్రయాలు నమోదయ్యాయి.
Read More :
Indian Students | కెనడాతో వివాదం.. ఆ దేశానికి వెళ్లే భారతీయ విద్యార్థుల్లో 86 శాతం తగ్గుదల
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

