ఆరు దశాబ్దాల తర్వాత అంజన్న నిజరూప దర్శనం
మహిమాన్విత క్షేత్రం.. భక్తుల కొంగుబంగారం జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధిలోని మూలవిరాట్ ఆరుదశాబ్దాల తర్వాత నిజరూప దర్శనం ఇవ్వనున్నది.
- కొండగట్టులో 15 నుంచి 20వరకు మూలవిరాట్‌కు చందనం తొలగింపు
- ఈ నెల 20 నుంచి వచ్చే నెల 29 వరకు నిజ అవతార దర్శనం
మల్యాల, నవంబర్ 12 : మహిమాన్విత క్షేత్రం.. భక్తుల కొంగుబంగారం జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధిలోని మూలవిరాట్ ఆరుదశాబ్దాల తర్వాత నిజరూప దర్శనం ఇవ్వనున్నది. ఈ నెల 15 నుంచి 20వరకు మూలవిరాట్‌కు చందనం తొలగింపు, 20వ తేదీ నుంచి వచ్చే నెల 29వరకు భక్తులకు నిజ అవతారాన్ని చూసే భాగ్యం కల్పించనున్నారు. శ్రీ వైష్ణవ ఆచార సంప్రదాయాల ప్రకారం 60 ఏండ్లుగా మూలవిరాట్‌కు ప్రతి మంగళ, శనివారాల్లో వేస్తున్న చందనాన్ని తొలగింపు, ఆలయ మహా సంప్రోక్షణ చేపట్టేందుకు సర్వం సిద్ధమవుతున్నది.
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో అనాదిగా వస్తున్న ఆచార వ్యవహారాల ప్రకారం మంగళ, శనివారం స్వామివారికి సింధూర లేపనం చేస్తుండటంతో ఆరు అంగుళాల మేర పేరుకుపోయింది. స్వామివారి వాస్తవ రూపం అలంకారంలోనే కనిపించడం లేదు. ఈ క్రమంలోనే ఆలయ అధికారులు, అర్చకులు ఆరు దశాబ్దాల తరువాత తొలిసారి సింధూర లేపనాన్ని తొలగించి మండల కాలంపాటు స్వామివారి నిజరూప దర్శనానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు ఇరువురు జీయర్ స్వాముల పర్యవేక్షణలో చందనం తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ఐదు రోజులపాటు ఆలయంలో స్వామివారి దర్శనాలను నిలిపివేస్తున్నట్టు చెప్తున్న ఆలయ అధికారులు, చెక్కతో చేసిన స్వామివారి ప్రతిరూపాన్ని బాలాలయంలో ప్రతిష్ఠించి దర్శనం కల్పిస్తామని పేర్కొన్నారు.
ఈ నెల 20న మహా సంప్రోక్షణ అనంతరం వచ్చే నెల 29 వరకు మూలవిరాట్ ఆంజనేయ స్వామి నిజరూప దర్శనం ఇవ్వనున్నారు. డిసెంబర్ 29న మూలవిరాట్‌ను మళ్లీ సింధూరంతో అలంకరించనున్నారు. తొలగించిన సిందూరాన్ని ఆలయం తరఫున భక్తులకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఇదే సమయంలో రూ.20 లక్షల వ్యయంతో ఆలయ సుందరీకరణ పనులు, ప్రధాన గోపురాలపై కలశాల ఏర్పాటు, సుదర్శన చక్ర ప్రతిష్ఠాపన వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

