న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: రిలయన్స్‌కు చెందిన రిటైల్ వెంచర్ లిమిటెడ్‌లో అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థ కేకేఆర్ తన వాటాను మరింత పెంచుకున్నది. ఇప్పటికే 1.17 శాతం వాటాను కొనుగోలు చేసిన సంస్థ..తాజాగా మరో రూ.2,069. 50 కోట్ల మేర పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ప్రకటించింది. దీంతో రిలయన్స్ రిటైల్‌లో కేకేఆర్ వాటా 1.42 శాతానికి చేరుకున్నది.