ఖైరతాబాద్, ఆగస్టు 8 : శ్రావణమాసం సందర్భంగా కలశ ఫైన్ జ్యువెల్స్ వినియోగదారులకు పండుగ సీజన్లో ప్రత్యేక ఆభరణాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. శ్రావణం ఎలిగెన్స్ పేరుతో నూతన ఆఫర్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. బంగారం, వెండి, వజ్రాభరణాల తయారీలో వంద శాతం తయారీ ఖర్చు, తరుగుదలకు మినహాయింపు అందిస్తోంది. అలాగే అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా స్వర్ణ కలశం పొదుపు పథకాన్ని తీసుకువచ్చింది.
ఇందులో వాయిదా పద్ధతిలో బంగారం, వెండి, వజ్రాభరణాలను కొనుగోలు చేయవచ్చు. మొదటి వాయిదా చెల్లించే వారికి 25 శాతం రాయితీ కల్పిస్తోంది. ఈ నెల 31వ తేదీ వరకు ఈ స్కీంలో చేరేందుకు అవకాశం కల్పించారు. పండుగ సీజన్, వివాహాది శుభకార్యాల కోసం వారసత్వ, నకిషి, జదావు తదితర విభిన్న రకాల జ్యువెల్లరీని అందుబాటులో ఉంచినట్లు డైరెక్టర్ అభిషేక్ చందా తెలిపారు.