Jio New Year Plan | మరో ఆరు రోజుల్లో 2023 కాల గర్భంలో కలిసిపోతోంది. కొత్త ఆశలు, ఆకాంక్షలకు బాటలు వేస్తూ 2024 వస్తోంది. ఈ తరుణంలో ప్రముఖ టెలికం సంస్థ రిలయన్స్ జియో తన యూజర్లకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఏడాది కాల పరిమితి గల రీచార్జీ ప్లాన్ మీద అదనపు వ్యాలిడిటీ అందిస్తున్నది. ఇప్పటికే యూజర్లకు ఏడాది రీచార్జీ ప్లాన్ అందుబాటులో ఉన్నది. దీనికి ‘హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ 2024’ పేరుతో లభించే అదనపు వ్యాలిడిటీ అందిస్తోంది జియో.
రూ.2,999 ప్రీ పెయిడ్ రీచార్జీ ప్లాన్‌తో జియో.. ఏడాది (365 రోజులు) వ్యాలిడిటీ అందిస్తున్నది. రోజూ అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తోపాటు 100 ఎస్ఎంఎస్లు, 2.5 జీబీ డేటా అందిస్తుంది. తాజా న్యూ ఇయర్ ఆఫర్‌తో మరో 24 రోజులు అదనపు వ్యాలిడిటీ లభిస్తుంది. అంటే రూ.2,999 ప్రీపెయిడ్ ప్లాన్ రీచార్జి చేసుకుంటే 389 రోజులు వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. దీంతోపాటు జియో క్లౌడ్, జియో టీవీ, జియో సినిమా యాప్స్‌లో కంటెంట్‌ను ఉచితంగా వీక్షించవచ్చు.