Reliance Jio | యూజర్ల పోర్టబిలిటీ ఎఫెక్ట్.. మళ్లీ రూ.999 ప్లాన్ తెచ్చిన జియో.. అదే బాటలో ఎయిర్ టెల్ కూడా..!
Reliance Jio | ఇటీవల అన్ని ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ ప్లాన్ల చార్జీలు పెంచేసిన రిలయన్స్ జియో 98 రోజుల వ్యాలిడిటీతో రూ.999 ప్లాన్ ను పునరుద్ధరించింది. అదే బాటలో ఎయిర్ టెల్ ప్రయాణిస్తోంది.
Reliance Jio | మొబైల్ ఫోన్ యూజర్ నుంచి సగటు ఆదాయం పెంచుకునే లక్ష్యంతో ఇటీవలే ప్రముఖ టెలికం సంస్థలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ సంస్థలు తమ మొబైల్ ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్ల చార్జీలు పెంచేశాయి. రిలయన్స్ జియో దీర్ఘకాలిక వ్యాలిడిటీతోపాటు వివిధ ప్లాన్లపై 10 నుంచి 27 శాతం చార్జీలు పెంచేసింది. అన్ని ప్లాన్లలోనూ మార్పులు చేసిన జియో.. తిరిగి రూ.999లతో కూడిన ప్లాన్ పునరుద్ధరించింది. ఈ నెల మూడో తేదీన పెంచిన చార్జీలతో ఆ ప్లాన్ టారిఫ్ రూ.1,199గా ఉండేది. టారిఫ్ చార్జీలు పెంచక ముందు రూ.999 ప్లాన్ కేవలం 84 రోజులకే వ్యాలిడిటీ ఉండేది. కానీఇప్పుడు దాన్ని 98 రోజులకు మార్చేసింది. గతంలో రోజూ 3జీబీ డేటా ఇచ్చిన జియో.. ఇప్పుడు దాన్ని 2జీబీ డేటాకు తగ్గించింది.
మరోవైపు ఎయిర్ టెల్ సైతం రూ.979 ప్లాన్ కింద రోజూ 2జీబీ డేటా ఆఫర్ చేసింది. రోజూ 100 ఎస్ఎంఎస్లతోపాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 84 రోజులు వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఈ ప్లాన్‌లో 5జీ అన్ లిమిలెడ్ డేటా కలిసి ఉంటుంది. అదనంగా 56 రోజుల పాటు ఫ్రీ అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ అందిస్తుంది.
5జీ డేటా ప్లాన్ల కింద రోజూ 2జీబీ డేటా లేదా 4జీబీ డేటాను అందించేందుకు ఎయిర్ టెల్, జియో సంస్థలు అన్ లిమిటెడ్ 5జీ డేటా ఆఫర్ చేస్తున్నాయి. జియో కనీసం నెలవారీ ప్లాన్ కింద రూ.349, ఎయిర్ టెల్ రూ.379 ప్లాన్ తెచ్చాయి. 5జీ బూస్టర్ ప్లాన్ల కింద రోజూ 4జీబీలో ఒకటి నుంచి 1.5 జీబీ డేటా అందించేందుకు జియో రూ.101, ఎయిర్ టెల్ రూ.151 ప్లాన్ అమలు చేస్తున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

