Isha Ambani | లగ్జరీ మాన్షన్‌ను విక్రయించిన ఇషా అంబానీ.. భారీ ధరకు కొనుగోలు చేసిన హాలీవుడ్ స్టార్ జంట
Isha Ambani | ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీ (Isha Ambani) లాస్ఏజెంల్స్లో ఉన్న ఓ మాన్షన్ (Los Angeles mansion)ను విక్రయించినట్లు సమాచారం.
Isha Ambani | ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీ (Isha Ambani) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రిలయన్స్ రీటైల్స్ వ్యాపారాన్ని విజయవంతంగా నడిపిస్తూ తండ్రికి తగ్గ తనయగా పేరు సంపాదించుకుంది. ఇక ఇషాకు ప్రముఖ బిజినెస్ మెన్ ఆనంద్ పిరమాల్‌తో వివాహం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ జంటకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
ఈ జంటకు విదేశాల్లో అత్యంత విలువైన ప్రాపర్టీస్ ఉన్న విషయం తెలిసిందే. అయితే, లాస్ఏజెంల్స్లో ఉన్న ఓ మాన్షన్ (Los Angeles mansion)ను ఇషా – ఆనంద్ జంట విక్రయించినట్లు సమాచారం. అత్యంత విలాసవంతమైన ఇంద్రభవనంలాంటి ఈ మాన్షన్‌ను అమెరికన్ స్టార్ సింగర్ జెన్నీఫర్ లోపేజ్ (Jennifer Lopez) – బెన్ అఫ్లెక్ (Ben Affleck) జంట కొనుగోలు చేసిందంట. ఈ ఇంటిని దక్కించుకునేందుకు గతేడాది జూన్‌లో జెన్నీఫర్ జంట రూ.500 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
లాస్ ఏంజెల్స్‌లోని బెవర్లీ హిల్స్ నడిబొడ్డున ఉన్న ఈ మాన్షన్‌ను 38,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 5.2 ఎకరాల్లో నిర్మించారు. ఇందులో మొత్తం 12 బెడ్రూమ్లు, 24 బాత్రూమ్లు, ఒక ఇండోర్ పికిల్‌బాల్ కోర్ట్, జిమ్, సెలూన్, స్పాలు, 155 అడుగుల పొడవైన ఇన్ఫినిటీ పూల్, అవుట్డోర్ కిచెన్ వంటివి ఉన్నట్లు తెలిసింది.
ఇక ఈ మాన్షన్‌తో ఇషా అంబానీకి ఉన్న అనుబంధం చాలా ప్రత్యేమైనదిగా చెప్పొచ్చు. ఎందుకంటే 2022లో ఇషా తన ప్రెగ్నెంట్ టైమ్ మొత్తం తల్లి నీతా అంబానీతో కలిసి ఈ ఇంట్లోనే గడిపిందట. అదే ఏడాది నవంబర్‌లో ఇషా ఇద్దరు పిల్లలు కృష్ణ, ఆదిత్యకు జన్మనిచ్చింది. డెలివరీ అనంతరం ఇండియాకు తిరిగి వచ్చేసింది. ఇప్పుడు ఆ ఇంటినే జన్నీఫర్ జంటకు విక్రయించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే అంత ఖరీదైన మాన్షన్‌ను ఇషా ఎందుకు విక్రయించిందనే విషయం మాత్రం తెలియరాలేదు.
Also Read..
Elephant Attacks | టూరిస్ట్స్ వాహనంపైకి దూసుకొచ్చిన ఏనుగు.. మహిళ మృతి.. షాకింగ్ వీడియో
Hand Sanitiser | శానిటైజర్‌ను అతిగా వాడుతున్నారా..? అయితే మీ మెదడు ప్రమాదంలో పడినట్లే..!
Navneet Kaur | సుప్రీంకోర్టులో అమరావతి ఎంపీ నవనీత్ కౌర్‌కు భారీ ఊరట
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

