Hand Sanitiser | శానిటైజర్‌ను అతిగా వాడుతున్నారా..? అయితే మీ మెదడు ప్రమాదంలో పడినట్లే..!
Hand Sanitiser | హ్యాండ్ శానిటైజర్ (Hand Sanitiser).. దీని గురించి తెలియని వారు ఉండరు. కరోనా పుణ్యమా అని ఇప్పుడు అంతా దీన్నే ఎక్కువగా వాడుతున్నారు. అనవసరంగా, అతిగా శానిటైజర్ వాడటంవల్ల చాలా దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం లేకపోలేదు.
Hand Sanitiser | హ్యాండ్ శానిటైజర్ (Hand Sanitiser).. దీని గురించి తెలియని వారు ఉండరు. కరోనా పుణ్యమా అని ఇప్పుడు అంతా దీన్నే ఎక్కువగా వాడుతున్నారు. ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా చేతులకు శానిటైజర్ రాసుకోవడం మాత్రం రోజూ కార్యకలాపాల్లో భాగంగా మారిపోయింది. దేన్ని పట్టుకున్నా వెంటనే జేబు లేదా పర్స్‌లో నుంచి శానిటైజర్ బాటిల్‌ను తీసుకుని వెంటనే చేతులపై రాసేసుకుంటున్నారు. అయితే, అనవసరంగా, అతిగా శానిటైజర్ వాడటంవల్ల చాలా దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం లేకపోలేదు.
హ్యాండ్ శానిటైజర్ అతిగా వాడటం వల్ల మన బ్రెయిన్ దెబ్బతింటుందని (brain problems) తాజా అధ్యయనంలో తేలింది. ఒహియో కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్సిటీలోని మాలిక్యులర్ బయాలజీ డిపార్ట్మెంట్ చేసిన సర్వేలే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హ్యాండ్ శానిటైజర్ వల్ల మెదడులోని కణాలు దెబ్బతింటాయని ఈ అధ్యయనంలో తేలింది. మనుషుల మెదడులో ఒలిగోడెండ్రోసైట్స్ అనే కణాలు ఉంటాయి. ఈ కణాలు మెదడులోని నరాల చుట్టూ వ్యాపించి ఉంటాయి. మెదడు వేగంగా, చురుగ్గా పనిచేసేందుకు ఈ కణాలు సహాయపడతాయి. ముఖ్యంగా మన బుర్రకు వేగంగా సంకేతాలు పంపించడంలో ఇవి ముఖ్యపాత్ర పోషిస్తాయి. అయితే, ప్రస్తుతం మనం వాడే శానిటైజర్లలో ఉన్న కొన్ని రసాయనాల కారణంగా ఈ కణాలు దెబ్బతినే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం చెబుతోంది.
మనం వాడే శానిటైజర్ కారణంగా అందులోని రసాయనాలు ముక్కు (వాసన), చేతులు, చర్మం ద్వారా శరీరంలోకి వెళతాయి. అలా వెళ్లిన శానిటైజర్లోని రసాయనాలు.. మెదడులోని నరాల చుట్టూ వ్యాపించి ఉన్న ఒలిగోడెండ్రోసైట్స్ కణాలను దెబ్బతీస్తాయని.. దీని వల్ల క్రమంగా మెదడు చురుగ్గా పనిచేయడం మానేస్తుందని అధ్యయనంలో వెల్లడైంది. ఒక్క హ్యాండ్ శానిటైజరే కాదు.. సబ్బులు,ఇంటినీ, టాయ్లెట్లను శుభ్రపరచటానికి ఉపయోగించే రసాయనాలను అతిగా వాడటం వల్ల సమస్యలు వచ్చి పడతాయట.
కేవలం మెదడుకే కాదు.. శానిటైజర్ అతిగా వాడటం మన ఆరోగ్యానికి చాలా హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శానిటైజర్ తరచుగా వాడినప్పుడు.. చర్మం కందిపోయి దద్దుర్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇందులోని ఆల్కహాల్‌తో పాటు ఉండే అనేక రసాయనాలు చర్మపు సహజ నూనెలను హరిస్తాయి. దాంతో చర్మంలోని సహజమైన తేమ తగ్గిపోయి పగుళ్లు ఏర్పడతాయి. ఈ పగుళ్ల ద్వారా బ్యాక్టీరియా చాలా తేలిగ్గా చర్మంలోకి చేరుతుంది.
శానిటైజర్లోని ఆల్కహాల్లో ఉండే ఐసోప్రొపనాలియన్ వంటివి చేతుల్లోని కణాలకు హాని కలిగిస్తాయి. దాంతో చర్మం పొడిబారుతుంది. ఇలా జరిగినప్పుడు డెర్మటైసిస్ ఇన్ఫెక్షన్లు వచ్చే అకవాశాలు ఎక్కువ. అంతేకాదు శానిటైజర్లలో ఉపయోగించే రసాయనాల పరిమళాలు కొందరికి అలర్జీ కలిగేలా చేస్తాయి. అంతేకాదు దీని వాడకం వల్ల హార్మోన్ల అసమతుల్యతకూ కారణమవుతుంది. అందులో ఉండే ట్రైక్లోసామ్ అనే రసాయనం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదం చేస్తుంది. అంతేకాకుండా ఈ బ్యాక్టీరియాకు యాంటీబయాటిక్‌లను తట్టుకునే సామర్థ్యమూ పెరుగుతుంది. దీంతో తేలికగా ఇన్ఫెక్షన్కు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read..
Navneet Kaur | సుప్రీంకోర్టులో అమరావతి ఎంపీ నవనీత్ కౌర్‌కు భారీ ఊరట
Gold Price | పసిడి భగభగలు.. రూ.70వేల మార్క్‌ను దాటిన 10 గ్రాముల బంగారం ధర
Borewell | 18 గంటల పాటు శ్రమించి.. బోర్వెల్లోపడిన రెండేళ్ల బాలుడిని రక్షించిన అధికారులు
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Satyavathi Rathod | సత్యవతి రాథోడ్‌కు కేటీఆర్ బర్త్ డే విషెస్.. వీడియో
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

