Gold Price | పసిడి భగభగలు.. రూ.70వేల మార్క్‌ను దాటిన 10 గ్రాముల బంగారం ధర
Gold Price | దేశంలో పసిడి ధరల జోరు (Gold Price) కొనసాగుతోంది. రోజురోజుకూ బంగారం ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతూ ఆల్‌టైం గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి.
Gold Price | దేశంలో పసిడి ధరల జోరు (Gold Price) కొనసాగుతోంది. రోజురోజుకూ బంగారం ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతూ ఆల్‌టైం గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ.70 వేల మార్క్‌ను దాటింది.
మార్కెట్ వర్గాల ప్రకారం.. గురువారం ఉదయం (ఏప్రిల్ 4) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారుగా రూ.70,620కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,750గా ఉంది. ఇక వెండి ధరలు కూడా రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర రూ.82,000 చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో దేశీయంగా ధరలు బలపడుతున్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
ఇవాళ దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
- ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,744 కాగా, 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.70,682గా ఉంది.
- చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.65,450 కాగా, 24 క్యారెట్ల పసిడి రూ.71,400గా ఉంది.
- కోల్‌కతాలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.64,600 కాగా, 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.70,470 పలుకుతోంది.
- బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో బంగారం ధరలు సేమ్‌గా ఉన్నాయి. ఈ రెండు మెట్రో నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,600 కాగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.70,470కి చేరింది.
- గురుగ్రామ్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 64,650 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,620 గా ఉంది.
- లక్నోలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.64,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.70,620గా ఉంది.
Also Read..
Rahul Gandhi | రాహుల్ గాంధీ మొత్తం ఆస్తి విలువ రూ.20 కోట్లు.. సొంత కారు కూడా లేదు..!
Japan Earthquake | జపాన్ను వణికించిన భారీ భూకంపం
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ఆంధ్రా విద్యుత్ పునరుద్ధణ పనుల్లో మన ఉద్యోగులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

