Infosys | ఇన్ఫోసిస్ భారీ షాక్.. ఆదాయ వృద్ధిలో అంచనాలు తలకిందులు.. కారణమిదేనా?
Infosys | ‘క్యూ1లో 2.3 బిలియన్ డాలర్ల విలువైన రెండు పెద్ద డీల్స్ సాధించాం. ఇవి భవిష్యత్ వృద్ధికి పటిష్ఠమైన పునాదిగా సహాయపడ్డాయి. మార్జిన్ల మెరుగుదలకు తగిన చర్యలు చేపట్టి ఐదు కీలక విభాగాల్లో మా లీడర్షిప్ బృందం పనిచేస్తున్నది’.
Infosys | న్యూఢిల్లీ, జూలై 20: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇన్వెసర్లకు భారీ షాక్ ఇచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వృద్ధి అంచనాల్ని అనూహ్యంగా తగ్గించింది. గతంలో ప్రకటించిన 4-7 శాతం వృద్ధి అంచనాలకు భిన్నంగా ఆదాయ వృద్ధి 1-3.5 శాతానికే పరిమితమవుతుందని హెచ్చరించింది. గురువారం కంపెనీ బోర్డు సమావేశం అనంతరం వెల్లడించిన క్యూ1 ఆర్థిక ఫలితాలు సైతం విశ్లేషకుల అంచనాల్ని అందుకోలేకపోయాయి.
2023 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ కన్సాలిడేటెడ్ నికరలాభం నిరుడు ఇదేకాలంతో పోలిస్తే 11 శాతం వృద్ధిచెంది రూ. 5,945 కోట్లకు పెరిగింది. మార్చి త్రైమాసికంతో పోలిస్తే 3 శాతం క్షీణించింది. మెజారిటీ విశ్లేషకులు ఇది రూ.6,150 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. క్యూ1లో కన్సాలిడేటెడ్ ఆదాయం 10 శాతం వృద్ధితో రూ. 37,933 కోట్లకు చేరింది. ఇది గత ఆర్థిక సంవత్సరం క్యూ4తో పోలిస్తే 1.3 శాతమే పెరిగింది. వ్యాపారం మందగించడం, అనిశ్చిత అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ వృద్ధి 1-3.5 శాతం మాత్రమే ఉంటుందని ఇన్ఫోసిస్ తెలిపింది. అయితే ఆపరేటింగ్ లాభాల మార్జిన్ గైడెన్స్‌ను మాత్రం యథాతథంగా 20-22 శాతంగా అట్టిపెట్టింది.
బీఎఫ్ఎస్ఐ దెబ్బ
ఇన్ఫోసిస్‌కు అధికంగా ఆదాయాన్ని ఆర్జించిపెట్టే బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్) దెబ్బ గట్టిగా తగిలింది. అమెరికాలో కొన్ని చిన్న బ్యాంకుల మూసివేతతో నెలకొన్న సంక్షోభ ప్రభావంతో ఇన్ఫీకి బీఎఫ్ఎస్ఐ నుంచి ఒనగూడిన ఆదాయం 4.7 శాతం క్షీణించింది. అయితే మాన్యుఫాక్చరింగ్, లైఫ్‌సైన్సెస్ రంగాల నుంచి వచ్చిన ఆదాయం రెండంకెల్లో వృద్ధిచెందింది. భౌగోళిక ప్రాంతాలవారీగా చూస్తే ఉత్తర అమెరికా నుంచి సమకూరిన ఆదాయ వృద్ధి 2.3 శాతానికే పరిమితం అయ్యింది. యూరప్ ఆదాయం 11 శాతం వృద్ధిచెందింది.
తగ్గిన ఉద్యోగుల సంఖ్య
జూన్ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 6 వేలకు పైగా తగ్గింది. 2023 జూన్ ముగిసేనాటికి ఉద్యోగుల సంఖ్య 3,36,294కు పరిమితమయ్యింది. మార్చి త్రైమాసికం నుంచి 6,940 మంది తగ్గారు. అలాగే కంపెనీ వలసల రేటు సైతం 20.9 శాతం నుంచి 17.3 శాతానికి పడిపోయింది.
ఇన్ఫీ ఏడీఆర్ క్రాష్
భారత స్టాక్ మార్కెట్ వేళలు ముగిసిన తర్వాత ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి యూఎస్ మార్కెట్లో ఇన్ఫోసిస్ ఏడీఆర్ 10 శాతం మేర క్షీణించి 15.93 డాలర్ల వద్దకు పతనమయ్యింది. ఇక్కడ ఎన్ఎస్ఈలో ఇన్ఫీ షేరు 1.7 శాతం క్షీణతతో రూ.1,449 వద్ద ముగిసింది.
‘క్యూ1లో 2.3 బిలియన్ డాలర్ల విలువైన రెండు పెద్ద డీల్స్ సాధించాం. ఇవి భవిష్యత్ వృద్ధికి పటిష్ఠమైన పునాదిగా సహాయపడ్డాయి. మార్జిన్ల మెరుగుదలకు తగిన చర్యలు చేపట్టి ఐదు కీలక విభాగాల్లో మా లీడర్షిప్ బృందం పనిచేస్తున్నది’
-సలీల్ పరేఖ్ ఇన్ఫోసిస్ సీఈవో
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

